AVATAROTSAVAMS OF SRI SUNDARARAJA SWAMY BEGINS _ శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు ప్రారంభం

Tiruchanoor, 9 Jul. 20:The annual Avatarotsavams of Sri  Sundararajaswami temple at Sri Padmavathi Ammavari Temple in Tiruchanoor commenced in ekantham on Thursday in view of Corona restrictions.

As a part of the three day festival, Snapana Tirumanjanam was performed in the Sri Krishnaswamy Mukha Mandapam to the utsava idols of  Sri Sundararajaswami and His consorts. Later in the evening, unjal Seva was conducted.

Dyeo Smt Jhansi Rani, AEO Sri Subramaniam and other temple officials and archakas participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

   
 

 

శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2020 జూలై 09: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసుందరరాజ స్వామివారి అవతారోత్సవాలు గురువారం ప్రారంభ‌మ‌య్యాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్స‌వాలు జరుగనున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నారు.

ఇందులో భాగంగా మధ్యాహ్నం శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో శ్రీసుందరరాజస్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం శ్రీ సుంద‌ర‌రాజ‌స్వామివారికి ఊంజల్‌ సేవ నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీసుబ్రమణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.