67th ALL INDIA COOPERATION WEEK CELEBRATIONS AT SVETA _ శ్వేతలో 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు 

Tirupati, 19 November 2020: TTD organised the 67th All India Cooperative week celebrations and cooperative training program at the SVETA Bhavan in Tirupati on Thursday.

Participating as Chief Guest TTD EO Dr KS Jawahar Reddy said the weeklong Cooperation week was celebrated as part of birth anniversary of India’s first Prime Minister Pandit Jawahar Lal Nehru.

Assuring that he would contribute to the growth of TTD Employees cooperative bank the TTD EO said Maharashtra and Gujarat were on the frontline of Cooperative sector.

Earlier the TTD employees cooperative bank president Sri Munivenkat Reddy highlighted the activities of the bank.

The Vice President of the Bank Sri Shiv Kumar also spoke on the significance of public, private and cooperative sectors in development of the country.

The cooperative Bank treasurer Sri Srinivasa, Directors Sri Venkatesh, Sri Kiran and Smt Hemalata, Sri Gunasekar and other employees were present.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

శ్వేతలో 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు

తిరుపతి, 2020 నవంబర్ 19: తిరుపతి శ్వేత భవనంలోని 67వ అఖిల భారత సహకార వారోత్సవాలు మరిము సహకార శిక్షణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి
ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు జన్మదినాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు సహకార ఉత్సవాలు జరుపుతున్నట్లు వివరించారు. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్టాలు సహకార రంగంలో ముందు ఉన్నట్లు తెలిపారు. టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు.

అంతకుముందు టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు అధ్యక్షులు శ్రీ ముని వెంకట రెడ్డి బ్యాంకు కార్యకలాపాల గురించి తెలియజేశారు.

అనంతరం ఉప అధ్యక్షులు శ్రీ శివ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ సహకార రంగాల గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ బ్యాంకు కోశాధికారి శ్రీ వాసు, డైరెక్టర్లు శ్రీ వెంకటేష్, శ్రీ కిరణ్, శ్రీమతి హేమలత, గుణ శేఖర్, టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.