MURALI KRISHNA MESMERISES ON SARVABHOOPALA _ సర్వభూపాలవాహనంపై శ్రీ ముర‌ళీకృష్ణుడి అలంకారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tirupati, 21 May 2021: On the fourth day evening, Sri Govindaraja Swamy along with Sri Devi and Bhu Devi showered blessings in the guise of Muralikrishna on Sarvabhoopala Vahanam.

As a part of the ongoing annual brahmotsavams in Sri Govindaraja Swamy temple in Tirupati on Friday, the Utsava murthies were seated on the shining Sarvabhoopala Vahanam to bless the devotees.

Both the Senior and Junior Pontiffs of Tirumala, Special Grade Deputy EO Sri Rajendrudu and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సర్వభూపాలవాహనంపై శ్రీ ముర‌ళీకృష్ణుడి అలంకారంలో శ్రీ గోవిందరాజస్వామి

తిరుపతి, 2021 మే 21: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్ర‌వారం సాయంత్రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ‌గోవిందరాజస్వామివారు శ్రీ ముర‌ళీకృష్ణుడి అలంకారంలో సర్వభూపాలవాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చారు.

”రాజా ప్రజారంజనాత్‌” అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. అనంతవిశ్వానికి సర్వభూపాలుడు అయిన శ్రీ గోవిందరాజస్వామి కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సర్వభూపాల వాహనాన్ని అధిరోహిస్తాడు. అంతేగాక పాలకుల అధికారి దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్సేవాపరులు కావాలని సర్వభూపాల వాహనసేవ ద్వారా స్వామివారు దివ్యమైన సందేశాన్ని ఇస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఏ.టి.శ్రీ‌నివాస దీక్షితులు, కంక‌ణ బ‌ట్టార్ శ్రీ ఏ.టి. పార్థ‌సార‌ధి దీక్షితులు, సూపరింటెండెంట్లు శ్రీ వెంక‌టాద్రి, శ్రీ కుమార్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ మునీంద్ర‌బాబు, శ్రీ కామ‌రాజు, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.