SURYAPRABHA VAHANAM HELD _ సూర్యప్రభ వాహనంపై గోవిందరాజస్వామి కటాక్షం

Tirupati, 22 May 2024: In the bright sunny daylight on Wednesday, Sri Govindaraja took out a celestial ride on the dazzling Suryaprabha Vahanam.

The annual Brahmotsavam of Sri Govindaraja Swamy temple entered the seventh day.

Both the Tirumala Pontiffs, DyEO Smt Shanti and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సూర్యప్రభ వాహనంపై గోవిందరాజస్వామి కటాక్షం
 
తిరుపతి, 2024 మే 22: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధవారం ఉదయం 7 గంటలకు గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు.
 
భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంంగళవాయిద్యాల నడుమ వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
 
సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రధాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్టించి స్వామి ఊరేగడం ఆనందదాయకం.
 
అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీభు సమేత గోవిందరాజస్వామివారికి స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, చందనంతో అభిషేకం చేశారు. 
 
రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
 
వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆల‌య  డెప్యూటి ఈవో శ్రీమతి శాంతి,  సూపరింటెండెంట్ శ్రీ మోహన్ రావు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
మే 23న రథోత్సవం
 
శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన గురువారం రథోత్సవం వైభవంగా జరుగనుంది.  ఉదయం 6.35 గంటల నుండి రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.