సెప్టెంబరు 14న శ్రీవారి సేవ – కక్షురకుల తుదిజాబితా విడుదల

సెప్టెంబరు 14న శ్రీవారి సేవ – కక్షురకుల తుదిజాబితా విడుదల

 తిరుమల, 2012 సెప్టెంబరు 12: ఈ ఏడాది సెప్టెంబరు మరియు అక్టోబర్‌ మాసాల్లో జరుగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలే కాకుండా వైకుంఠ ఏకాదశి, నూతన వత్సరాది(2013) మరియు మకరసంక్రాంతి వరకు తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తితిదే యాజమాన్యం ప్రవేశపెట్టిన శ్రీ”వారి సేవలో భాగంగా ఉచిత కల్యాణకట్ట సేవ స్వచ్ఛందంగా చేయడానికి ముందుకొచ్చి దరఖాస్తు చేసుకున్న  తిరుమల, తిరుపతి, చిత్తూరు జిల్లాకు మాత్రమే చెందిన సేవకుల తుది జాబితాను ఈ నెల 14వ తేదీన తితిదే విడుదల చేయనుంది.

ఎంపికైన సేవకుల తుది జాబితాను తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాలు, తిరుమలలోని ఆర్‌టిసి బస్టాండులోపల గల శ్రీవారి సేవా సదన్‌ కార్యాలయం, కల్యాణకట్టలలోని నోటీసు బోర్డుల్లో చూసుకోవచ్చు. ఈ జాబితా శుక్రవారం ఉదయం 10.00 గంటల నుండి అందుబాటులో ఉంటుంది.

అంతేగాక ఎంపికైన సేవకుల జాబితాను తితిదే వెబ్‌సైట్‌ గీగీగీ.శిరిజీతిళీబిజిబి.ళిజీవీలో ఈ నెల 14వ తేదీ ఉదయం 10.00 గంటలకు విడుదల చేస్తారు. ఎంపికైన వారు సెప్టెంబరు 15వ తేదీ ఉదయం 11.00 గంటలకు తిరుమలలోని శ్రీవారి సేవ కార్యాలయానికి హాజరుకావాల్సి ఉంటుంది. అక్కడ సేవకులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతోపాటు కల్యాణకట్ట డెప్యూటీ ఈఓ ఆధ్వర్యంలో షిప్టుల వారీగా విధులు కేటాయిస్తారు. అనంతరం వారి సేవలు వినియోగించే తేదీలను తెలియజేస్తారు.

ఎంపికైన సేవకులు ఎవరైనా ఇదివరకు రూ.100 బాండు జత చేర్చనిచో 15వ తేదీ శ్రీవారి సేవా సదన్‌ కార్యాలయానికి వచ్చేటప్పుడు తీసుకురావాల్సి ఉంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.