SWARNARATHAM HELD _ స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం

TIRUPATI, 23 MAY 2024: As part of the three-day annual Vasanthotsavam in Sri Padmavati Ammavari temple in Tiruchanoor, Swarnaratham was observed on Thursday.

On the second day morning, the deity was taken on a grand procession along Mada streets on the golden chariot.

CE Sri Nageswara Rao, SE2 Sri Jagadeeshwar Reddy, EE Sri Narasimha Murty, DyEO Sri Govindarajan and others, devotees participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం

తిరుపతి, 2024 మే 23: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజు గురువారం ఉదయం స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. ఆలయంలో ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీపద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని అర్చకులు స్వర్ణరథంపై ఆశీనురాలిని చేశారు.

మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

స్వర్ణరథోత్స‌వంలో సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఆల‌య అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ శేష‌గిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ గ‌ణేష్‌, విశేష‌సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.