JEO REVIEWS WORKS AT SVIMS _ స్విమ్స్‌లో అభివృద్ధి ప‌నుల ప్ర‌గ‌తిపై జెఈవో స‌మీక్ష‌

Tirupati, 20 Dec. 21: On the directions of TTD EO Dr KS Jawahar Reddy, the TTD Joint Executive Officer Sri Veerabrahmam on Monday reviewed the ongoing development works at SVIMS with Engineering officials and SVIMS director Dr Vengamma.

 

Speaking on the occasion JEO said the Nephroplus building would be transformed in a phased manner into 95 rooms with AC, furniture gas line etc. In the first phase, 30 rooms by January 13 and the rest 65 be readied by end of February 2022.

 

 He said the tenders be invited at the earliest for construction of a central godown and that the final decision on the construction of Arogyasree Bhavan would be taken at EO review on Tuesday.

 

He urged officials to complete the Fire tender system works at the SVIMs on a war footing.

 

TTD chief engineer Sri Nageswar Rao, EE Sri Krishna Reddy Dy EE Sri Harshavardhan Reddy and SVIMS officials were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స్విమ్స్‌లో అభివృద్ధి ప‌నుల ప్ర‌గ‌తిపై జెఈవో స‌మీక్ష‌

తిరుపతి, 2021 డిసెంబరు 20: టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆదేశాల మేర‌కు స్విమ్స్‌లో జ‌రుగుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల ప్ర‌గ‌తిపై జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం సోమ‌వారం స్విమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ వెంగ‌మ్మ‌తో క‌లిసి టిటిడి, స్విమ్స్ ఇంజినీరింగ్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ నెఫ్రో ప్ల‌స్ భ‌వ‌నాన్ని రోగుల కోసం ఎసి, ఫ‌ర్నీచ‌ర్‌, గ్యాస్‌లైన్లు త‌దిత‌ర వ‌స‌తుల‌తో 95 ప్ర‌త్యేక గ‌దులుగా మార్చాల‌ని సూచించారు. వీటిలో జ‌న‌వ‌రి 13లోపు 30 గ‌దులు, ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులోపు మిగిలిన 65 గ‌దులను అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. సెంట్ర‌ల్ గోడౌన్ భ‌వ‌న నిర్మాణానికి త్వ‌రిత‌గ‌తిన టెండ‌ర్లు పిలవాల‌ని ఆదేశించారు. మంగ‌ళ‌వారం జ‌రుగ‌నున్న ఈవో స‌మీక్షలో ఆరోగ్య‌శ్రీ భ‌వ‌న నిర్మాణంపై తుది నిర్ణ‌యం తీసుకుంటార‌ని చెప్పారు. స్విమ్స్‌లో అగ్నిమాప‌క వ్య‌వ‌స్థ ప‌నులు వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ఆదేశించారు.

ఈ స‌మీక్ష‌లో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఇఇ శ్రీ కృష్ణారెడ్డి, డెప్యూటీ ఇఇ శ్రీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి, స్విమ్స్ అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.