KODANDARAMA RIDES HANUMANTA VAHANA _ హ‌నుమంత వాహ‌నంపై కోదండరాముని అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న అభ‌యం

Tirupati, 7 Mar. 21: Sri Kalyana Venkateshwara Swamy in Sri Kodandarama alankaram seated majestically on Hanumanta vahana on the sixth day of ongoing annual Brahmotsavams at Srinivasa Mangapuram held in Ekantham due to Covid guidelines.

Legends say that Hanuman is an icon of devotional bliss and symbolically stood for pure devotion, complete surrender and absence of ego. 

In the place of Vasanthotsavam and Swarna Ratham, Tiruchi and Gaja vahana Seva will be observed in the evening.

 DyEO Smt Shanti, AEO Sri Dhananjeyulu, Superintendents Sri Ramanaiah, Sri Chengalrayulu participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హ‌నుమంత వాహ‌నంపై కోదండరాముని అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న అభ‌యం

తిరుపతి, 2021 మార్చి 07: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం శ్రీ‌నివాసుడు కోదండరాముని అలంకారంలో కటాక్షించారు.

శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం నుండి తెలుస్తోంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు. కావున దాసభక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.

మధ్యాహ్నం 3 గంటలకు వసంతోత్సవం, సాయంత్రం 4.20 గంటలకు స్వర్ణరథానికి బదులుగా బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 గంటలకు గజ వాహనసేవ జరుగుతాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.