₹14.93 LAKH WORTH WEIGHING PAD DONATED _ టీటీడీకి రూ.14.93 ల‌క్ష‌ల విలువైన వెయింగ్ ప్యాడ్‌ బ‌హుక‌ర‌ణ‌

Tirumala, 2 Jun. 22: Sri Gautam, a devotee from Guntur, and managing partner of MVR technologies has donated a portable axil weighing pad (Axil scale) worth ₹14.93 lakhs to TTD.

The equipment which facilitated the weighing of 60 tons of material loaded on lorries was handed over to Srivari Temple DyEO Sri Ramesh Babu at the Tirumala flour mill.

Srivari Potu Peishkar Sri Parthasarathy and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రూ.14.93 ల‌క్ష‌ల విలువైన వెయింగ్ ప్యాడ్‌ బ‌హుక‌ర‌ణ‌

తిరుమల, 2022 జూన్ 02: తిరుమ‌ల శ్రీ‌వారికి గుంటూరుకు చెందిన ఎం.వి.ఆర్‌.టెక్నాల‌జిస్ సంస్థ రూ.14.93 ల‌క్ష‌ల విలువైన ఒక యాక్సిల్ స్కెల్(పోర్ట‌బుల్ యాక్సిల్ వెయింగ్ ప్యాడ్)ను సంస్థ మెనేజింగ్ పార్ట‌న‌ర్ శ్రీ గౌత‌మ్ బహుకరించారు.

తిరుమ‌ల‌లోని ఫ్లోర్ మిల్ వ‌ద్ద శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌ ర‌మేష్‌బాబుకు దాత యాక్సిల్ వెయింగ్ ప్యాడ్‌ను అందించారు. ఈ వెయింగ్ ప్యాడ్‌ ను సుల‌భంగా కింద ప‌ర్చి 60 ట‌న్నుల వ‌ర‌కు లారీల‌లోని ముడి ఆహార ప‌దార్థాల బ‌రువు చూడ‌టానికి వీటిని వినియోగిస్తారు.

ఈ కార్యక్రమంలో పోటు పేష్కార్ శ్రీ పార్థ‌సార‌ధి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.