”0” తోనే ఈ ప్రపంచం ముడిపడి వుంది – ఆచార్య అరుణాచలం

”0” తోనే ఈ ప్రపంచం ముడిపడి వుంది – ఆచార్య అరుణాచలం

తిరుపతి, 2010 మార్చి 05: మొదటి పత్ర సమర్పణ చేసిన అరుణాచలం మాట్లాడుతూ అనంతమైన ”0′ తోనే ఈ ప్రపంచం ముడిపడి వుందని.  అనేది పాజిటివ్‌ గాను, నెగెటివ్‌గానూ వుంది. వేదకాలం నుండి సంఖ్యాశాస్త్ర ప్రాముఖ్యత వున్నదని వాల్మీకి రోజుల్లోనే ”అక్షాహిణి” అను పదం వాడారని ఈపదం సంఖ్యను సూచిస్తుందని, సంఖ్యలు, గణితపు లెక్కలు ఆరోజుల నుండే వున్నాయన్నారు. సి.యన్‌.ఆర్‌. ప్రభు గారి అధ్యక్షతన సభ ప్రారంభమైంది.

అంధుడైన సంజీవరాయశర్మ ఆరోజుల్లోనే గణిత అవధాన కౌశల చేసిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. పింగళ చంధశాస్త్రం వంటివి కూడా సంఖ్యల ఆధారంగానే రాసాడని ఇవన్నీ గమనిస్తే ‘ం’ అనేది అనంతంగా వుండి మిగిలిన సంఖ్యలలో కలిసి ప్రపంచంలోనే తన ప్రాముఖ్యాన్ని చాటుకొంటుందని అన్నారు. ఆర్వీ యస్‌.యస్‌. అవధానులు రెండవ పత్ర సమర్పణ చేస్తూ కంప్యూటర్‌ విజ్ఞానానికి మీమాంస శాస్త్రానికి గల సంబంధాన్ని, తేడాల గురించి వివరించారు.

మీమాంస శాస్త్రంలో సాధ్యం, సాధన, వంటివే నేటి కంప్యూటర్‌లో జావా, సి, సీప్లస్‌గా వచ్చాయని పూర్ణాంకాలు బిన్నాంకాలు, విధి వ్యాఖ్య,మంత్ర వాఖ్య, నామదేయ వాఖ్య, నిషేధవాఖ్య లాంటివి మీమాంసలో వుంటే కంప్యూటర్‌ (విజ్ఞానం) లో ఉదాహరణకి బిగ్‌ ప్రోగ్రామ్‌ను కొన్ని భాగాలుగా, భాగాలను విభాగాలుగా చేసుకొంటారు. వీటికి టైటిల్స్‌ పెడుతారు. ఇది మీమాంసలో నామధేయ వ్యాఖ్య దగ్గర సంబంధమున్నదని ఇలా శాస్త్రానికి కంప్యూటర్‌కి దగ్గర సంబంధముందని పత్ర సమర్పణ చేసారు.

మురళి గారు యూనికోడ్‌ మీద వేదాల నుండి పదాలు కామన్‌గా వున్నవాటిపై చర్చించి వేదాలలో పదాలను మనమిప్పటికీ వాడుకోవడం మీద చర్చించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.