1.29 lAKH KGS OF VEGETABLES DONATED FOR BRAHMOTSAVAM- ANNAPRASADAM SO_ బ్రహ్మోత్సవాల్లో 1.29 ల‌క్ష‌ల కిలోల కూర‌గాయ‌లు వినియోగం : అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.వేణుగోపాల్

Tirumala, 3 Oct. 19: TTD has received a whopping 1.29 lakh kgs of vegetables from Karnataka, Tamil Nadu, AP for Sri Venkateswara Nitya Anna Prasadam Trust for making Anna Prasadam to lakhs of devotees during ongoing annual Brahmotsavams, says Sri S Venugopal, the Special Officer of Annaprasadam wing.

Speaking at the press meet in the Media Center on Thursday he said on Garuda seva day 2 lakh packets of Pulihora, 1.75 lakh Tomato rice and Bisibela bath were readied for distribution among devotees besides milk, buttermilk, snacks, drinking water and annamprasadams.

For preparing Garuda seva food packets,  32,500 kgs of rice, 20,000 liters of milk, 20 tons of vegetables and 8000 kgs of upma rava has been earmarked.

TTD has deployed ten mobile food distribution vehicles and the Anna prasadam complex will be open from 7.30am till 11.00 pm during all days and on Garuda seva day will operate till 1.30 am.

While food packets will be provided to devotees on the mada street galleries till 6pm. Buttermilk for children, coffee and tea for elders will be given on 24 hours basis. While food courts were set up on walkers paths,Vaikuntam Queue complex. Nearly 10,000 personnel including employees, Srivari Sevakulu, Scouts, TTD Vigilance, Police and others were provided food at the employees canteen during brahmotsavams,  he added.

He said presently 1085 persons were engaged in food arrangements during Brahmotsavams and 250 more would be deployed during Garuda seva day. Nearly 1000 Srivari Sevakulu were being deployed to serve devotees in 175 galleries of Mada streets. Food is supplied to devotees after tested by food experts in TTD labs,  he said.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాల్లో 1.29 ల‌క్ష‌ల కిలోల కూర‌గాయ‌లు వినియోగం : అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.వేణుగోపాల్

అక్టోబరు 03, తిరుమల, 2019:  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి గాను మొత్తం 1.29 ల‌క్ష‌ల కిలోల కూర‌గాయ‌లు వినియోగిస్తామ‌ని శ్రీవేంకటేశ్వర అన్న‌ప్రసాదం ట్రస్టు ప్రత్యేకాధికారి శ్రీ ఎస్‌.వేణుగోపాల్ తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో గురువారం అన్న‌ప్ర‌సాద విభాగం అధికారులు మీడియా స‌మావేశం వివరించారు.

 ఈ సంద‌ర్భంగా శ్రీ ఎస్‌.వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ అన్నప్రసాదం, అల్పాహారం, పాలు, మజ్జిగ భక్తులకు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల నుండి దాత‌లు కూర‌గాయ‌ల‌ను విరాళంగా అందిస్తున్నార‌ని వివ‌రించారు. గ‌రుడ‌సేవ నాడు 2 ల‌క్ష‌ల పులిహోర‌, 1.75 ల‌క్ష‌ల ట‌మోటా రైస్‌, బిసిబెళా బాత్ క‌లిపి మొత్తం 3.75 ల‌క్ష‌ల పొట్లాలు భ‌క్తుల‌కు పంపిణీ చేస్తామ‌న్నారు. మొత్తం 32,500 కిలోల బియ్యం, 20 వేల లీట‌ర్ల పాలు, 20 ట‌న్నుల కూర‌గాయ‌లు, 8 వేల కిలోల ఉప్మార‌వ్వ‌ వినియోగిస్తామ‌ని వెల్ల‌డించారు. 10 వాహ‌నాల‌తో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్నారు. అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో ఉద‌యం 7.30 నుండి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు, గ‌రుడ‌సేవ‌నాడు ఉద‌యం 7.30 నుండి రాత్రి 1.30 గంట‌ల వ‌ర‌కు భ‌క్తులకు అన్న‌ప్ర‌సాదాలు పంపిణీ చేస్తామ‌ని తెలిపారు.  

          విశేషమైన గరుడ వాహనం రోజున నాలుగు మాఢ వీధుల్లోని గ్యాలరీలలో వేచివుండే భక్తులకు మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు పెరుగన్నం, సాంబరన్నం, బిసిబెళా బాత్‌, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందివ్వనున్నట్లు తెలిపారు. చిన్నపిల్లలకు 24 గంటలు పాలు, పెద్ద‌ల‌కు కాఫీ, టీ అందివ్వనున్నట్లు తెలియజేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, కాలినడక మార్గం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, క్యూలైన్లు, ఫుడ్‌కౌంట‌ర్లు, యాత్రికుల వసతి సముదాయాలలోని భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు వివ‌రించారు. టిటిడి ఉద్యోగుల క్యాంటీన్ వ‌ద్ద‌ ప్రతిరోజు 10 వేల మందికి పైగా పోలీస్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, డెప్యుటేష‌న్ సిబ్బందికి, శ్రీవారిసేవకులకు అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు.

 క్యాట‌రింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్త్రి మాట్లాడుతూ అన్న‌ప్ర‌సాదం విభాగంలో 1085 మంది సిబ్బంది సేవ‌లందిస్తున్నార‌ని, గ‌రుడ‌సేవ‌నాడు అద‌నంగా 250 మంది సేవ‌ల‌ను వినియోగించుకుంటామ‌ని తెలిపారు. మాడ వీధుల్లోని మొత్తం 175 గ్యాల‌రీల్లో భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు దాదాపు 1000 మంది శ్రీ‌వారి సేవ‌కులు అందుబాటులో ఉన్నార‌ని చెప్పారు. అన్న‌ప్ర‌సాదం తయారీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఆరోగ్య విభాగం నిపుణులు పరీక్షించిన తరువాత భక్తులకు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టిటిడి సిబ్బంది, శ్రీవారి సేవకులు నిరంతరాయంగా కృషి చేస్తునట్లు తెలిపారు.

మీడియా స‌మావేశంలో టిటిడి పిఆర్వో డా|| టి.రవి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.