10 K VISIT TTD SCULPTURE EXPO _ ఎస్వీ శిల్ప‌క‌ళాశాల‌లో ముగిసిన శిల్పాల‌ ప్ర‌ద‌ర్శ‌న

Tirupati, 3 Mar. 22: The first ever expo cum sale of TTD sculptures has witnessed a footfall of over 10 thousand from different parts of the country.

The six-day expo concluded on Thursday filling up new energy among the sculpture and traditional painting students of TTD.

On February 26 this unique exhibition cum sale was commenced and TTD netted over two lakhs with the sale of products crafted by the sculpture students.

The expo was commenced by JEO (H & E) Smt Sada Bhargavi on February 26 and supervised by DEO Sri C Govindarajan.

During these six days the students of all the TTD institutions, officials also visited the expo and admired the skills of the sculpture students.

The Principal of Sculpture College Sri Venkat Reddy and other faculty members, students were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఎస్వీ శిల్ప‌క‌ళాశాల‌లో ముగిసిన శిల్పాల‌ ప్ర‌ద‌ర్శ‌న

పలు ప్రాంతాల భ‌క్తుల సంద‌ర్శ‌న‌

తిరుపతి, 2022 మార్చి 03: టిటిడి ఆధ్వ‌ర్యంలో తిరుప‌తిలో ఉన్న‌ శ్రీ వేంక‌టేశ్వ‌ర సంప్ర‌దాయ ఆల‌య నిర్మాణ శిల్ప‌శిక్ష‌ణ సంస్థ‌లో ఫిబ్ర‌వ‌రి 26 నుండి ఆరు రోజుల పాటు నిర్వ‌హించిన శిల్పాల‌ ప్ర‌ద‌ర్శ‌న, అమ్మ‌కం గురువారం ముగిసింది. జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క ప్రాంతాల భ‌క్తులు ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను సంద‌ర్శించారు.

శిల్ప‌క‌ళాశాల విద్యార్థులు రూపొందించిన దేవాల‌య విమానాలు, మండ‌పాలు, గోపురాలు, శిలాశిల్పాలు, సుధాశిల్పాలు, దారుశిల్పాలు, పంచ‌లోహ శిల్పాలు, సంప్ర‌దాయ వ‌ర్ణ‌చిత్రాలు, సంప్ర‌దాయ క‌లంకారి వ‌ర్ణ‌చిత్రాలను ప్ర‌ద‌ర్శించ‌డంతోపాటు విక్ర‌యానికి ఉంచారు.

ఈ ఆరు రోజుల్లో మొత్తం 10,157 మంది ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను సంద‌ర్శించారు. విద్యార్థులు త‌యారుచేసిన ప‌లు క‌ళాకృతుల‌ను సంద‌ర్శ‌కులు విరివిగా కొనుగోలు చేశారు.

ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను ప‌లువురు టిటిడి బోర్డు స‌భ్యుల‌తోపాటు అన్ని విభాగాల అధికారులు, తిరుప‌తిలోని ప్ర‌ముఖులు, టిటిడి విద్యాసంస్థ‌లు, ఇత‌ర విద్యాసంస్థ‌ల విద్యార్థులు, టిటిడి ఉద్యోగులు, వారి కుటుంబ స‌భ్యులు, శిల్ప క‌ళాశాల పూర్వ విద్యార్థులు సంద‌ర్శించారు.

ముగింపు కార్య‌క్ర‌మంలో టిటిడి విద్యాశాఖాధికారి శ్రీ గోవింద‌రాజ‌న్‌, క‌ళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీ కె.వెంక‌ట‌రెడ్డి, అధ్యాప‌కులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.