THE MEETING ON THE TTD IMMOVABLE ASSETS WITH THE ASSETS PROTECTION COMMITTEE WAS HELD ON THURSDAY _ టిటిడి ఆస్తుల పరిరక్షణ కమిటీ తొలి సమావేశం
Tirupati, 21 Jan. 21:The first meeting of the committee took place under the Chairmanship of TTD EO Dr KS Jawahar Reddy with JEO Health and Education Smt Sada Bhargavi as Convenor at EO Chambers’ in the TTD Administrative Building in Tirupati.
The Committee comprising of Sringeri Sarada Peetham Admin and CEO Sri Gauri Shankar, Kanchikamakoti Peetham Representative Retd. Chief Justice Sri Seetharamamurthy, Mantralaya Peetham Representative Sri Sridhar Rao, TTD Trust Board members Sri Vaidhyanathan Krishnamurthy, Sri Govind Hari, Veteran Journalist Sri K Ramachandramurthy, Social Activist Sri Bayya Srinivasulu made some recommendations on the immovable assets of TTD.
Excerpts from the meeting :
To ensure that all land assets donated by devotees to TTD should be utilised for religious activities only.
To utilize assets with small areas for setting up Goshalas for stray cattle, Gita Mandirams etc. which are useful to the local people.
To formulate strategic plans within a fixed time frame to look into these issues.
Earlier the committee members were appraised on details of TTD assets across the country from 1974-2014 through powerpoint presentation and also on the latest status of the assets and assets pending in legal hassles etc.
It may be mentioned here that the TTD Trust Board has already resolved that the land assets donated by the Srivari devotees should never be sold away and the committee to examine the feasibility of utilisation of such properties which are not viable to TTD in any way.
During his remarks after the review meeting, TTD EO Dr Jawahar Reddy directed officials concerned to utilise the properties in such a manner not to hurt the sentiments of donors and ensure that they are utilized for spiritual activities only.
He also called for a re-examination on Lease Policy terms review of assets.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టిటిడి ఆస్తుల పరిరక్షణ కమిటీ తొలి సమావేశం
తిరుపతి, 2021 జనవరి 21: టిటిడికి భక్తులు కానుకగా ఇచ్చిన స్థలాలను ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించే అంశాన్ని పరిశీలించాలని టిటిడి ఆస్తుల పరిరక్షణ కమిటీ అధికారులకు సూచించింది. టిటిడి పరిపాలనా భవనంలో ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం కమిటీ తొలి సమావేశం జరిగింది.
శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తులు, భూములను శాశ్వతంగా విక్రయించరాదని, టిటిడికి ఉపయోగపడని భూములను ఏవిధంగా ఉపయోగంలోకి తీసుకురావాలనే విషయాలను పరిశీలించడానికి ధర్మకర్తల మండలి తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు శృంగేరి శారదాపీఠం సిఈవో శ్రీ గౌరీశంకర్, కంచి మఠం ప్రతినిధి శ్రీ సీతారామమూర్తి, రిటైర్డ్ చీఫ్ జస్టిస్, మంత్రాలయం పీఠాధిపతి ప్రతినిధి శ్రీ శ్రీధర్‌రావు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ వైద్యనాథన్ కృష్ణమూర్తి, శ్రీ గోవింద హరి, సీనియర్ జర్నలిస్టు శ్రీ కె.రామచంద్రమూర్తి, సామాజికవేత్త శ్రీ బయ్యా శ్రీనివాసులుతో టిటిడి కమిటీ ఏర్పాటు చేసింది. 1974 నుంచి 2014 దాకా దేశవ్యాప్తంగా టిటిడి విక్రయించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు, ప్రస్తుతం ఉన్న ఆస్తుల స్థితికి సంబంధించిన వివరాలు, కోర్టు కేసులు ఇతర వివాదాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీ సభ్యులకు వివరించారు. తక్కువ విస్తీర్ణం గల స్థలాల్లో గోశాలలు, గీతామందిరాలు, ఇతర ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఈవో డాక్టర్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ భక్తులు స్వామివారికి స్థలాలు, భూములు కానుకగా సమర్పించే సమయంలో అధికారులు వారి మనోభావాలు దెబ్బతినకుండా, ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగ పడేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టిటిడి భూములకు సంబంధించిన లీజు పాలసీని పునఃపరిశీలన చేయాలన్నారు. త్వరలో కమిటీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో జెఈవో, కమిటీ కన్వీనర్ శ్రీమతి సదా భార్గవి, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ మల్లిఖార్జున పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.