11th EDITION OF AKHANDA AYODHYAKANDA PARAYANAM ON JUNE 11 _ జూన్ 11న అయోధ్యకాండ 11వ విడ‌త‌ అఖండ పారాయ‌ణం

Tirupati,08, June: 2024: TTD is organising the 11th edition of Ayodhya Kanda Akhanda Parayanams on June 11 at the Nada Niranjanam platform in Tirumala seeking the well-being of humanity and the SVBC will do a live telecast of the event from morning 7.00 am to 9.00  am.

The parayanam will comprise of 162 shlokas of 40-45 sargas of Ayodhyakanda,35 shlokas of Yogavashistam and Dhanvanthri Maha mantra totalling 187 shlokas.

Prominent Vedic exponents from SV Veda Vijnanan Peetham, SV Veda University and TTD Veda pundits, TTD Sambhavna pundits from the Annamacharya project and the national Sanskrit university will participate.

TTD appealed to Srivari devotees worldwide to participate in the Parayanams being live telecast for their benefit.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూన్ 11న అయోధ్యకాండ 11వ విడ‌త‌ అఖండ పారాయ‌ణం

తిరుమల, 2024 జూన్ 08: లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై జూన్ 11వ తేదీ 11వ విడ‌త అయోధ్య‌కాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

అయోధ్యకాండలోని 40 నుండి 44వ‌ సర్గ వ‌ర‌కు మొత్తం ఐదు స‌ర్గ‌ల్లో 162 శ్లోకాలు, యోగ‌వాశిష్టం మ‌రియు ధ‌న్వంత‌రి మ‌హామంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 187 శ్లోకాల‌ను పారాయణం చేస్తారు. ఎస్.వి.వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.