128TH CONVOCATION OF VEDA VIGNANA PEETHAM HELD IN DHARMAGIRI _ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వేడుకగా 128వ స్నాతకోత్సవం
TIRUMALA, 16 DECEMBER 2022: The 128th Convocation ceremony of the the138-year old Veda Vignana Peetham was held on Friday at Dharmagiri in Tirumala which was graces by both the seers of Tirumala.
In his Anugraha Bhashanam on the occasion, HH Sri Pedda Jeeyar Swamy of Tirumala recalled that he was also a student from this great institution in 1960 and later worked as a faculty and now with the blessings of Sri Venkateswara Swamy has become the Pedda Jeeyar of Tirumala. He complimented TTD management for taking the forward Vedic knowledge in a big way for the sake of future generations.
HH Sri Chinna Jeeyar Swamy of Tirumala rendering his blessings to Vedic students said the Dharmagiri Veda Vignana Peetham is the oldest Vedic institution in South India. The students who studied here have now settled in various temples across the country as well in overseas also. “Since you are all now degree holders, you should develop the Vedic education and spread the Vedic knowledge”, he asserted.
Smt Swaralatha, spouse of TTD Trust Board Chairman, complimented and thanked the faculty and students of the historical Vedic institution for their strenuous efforts for the sustenance and in spreading the Vedic knowledge for the future generations.
Earlier, the Principal of Veda Vignana Peetham Sri KSS Avadhani briefed about the history of the institution. At present there are 17 courses with over 500 students studying at the institution. Due to the Covid pandemic, we have not organised the Convocation in the last two years. “Today we are giving away the certificates to 113 students which includes both 2019-20 and 2020-21 years”, he maintained.
Devasthanams Educational Officer Sri Bhaskar Reddy, other faculty members, students of various Vedic departments, their parents were also present.
The outgoing students were given away the certificates along with silver dollar.
ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వేడుకగా 128వ స్నాతకోత్సవం
తిరుమల, 2022 డిసెంబరు 16: తిరుమలలోని ధర్మగిరిలో 138 ఏళ్ల చరిత్ర కలిగిన వేద విజ్ఞాన పీఠం 128వ స్నాతకోత్సవం శుక్రవారం జియ్యంగార్ల సమక్షంలో వేడుకగా జరిగింది.
ఈ సందర్భంగా తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ 1960లో తాను ఇక్కడే విద్యను అభ్యసించానని, ఆ తర్వాత అధ్యాపకుడిగా పనిచేశానని, ప్రస్తుతం శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుమల పెద్దజీయర్‌గా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్ తరాల కోసం వేద విజ్ఞానాన్ని పెద్దఎత్తున ముందుకు తీసుకెళ్తున్న టిటిడి యాజమాన్యాన్ని అభినందించారు.
తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వేద విద్యార్థులకు ఆశీస్సులు అందజేస్తూ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం దక్షిణ భారతదేశంలోనే అతి పురాతన వేదశిక్షణ సంస్థ అన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ప్రస్తుతం దేశంలోనే కాకుండా విదేశాల్లో వివిధ దేవాలయాల్లో స్థిరపడ్డారని చెప్పారు. ప్రస్తుతం పట్టభద్రులైన విద్యార్థులు వేద విద్యను మరింత అభివృద్ధి చేసి, వేద జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలని కోరారు.
టిటిడి ఛైర్మన్ సతీమణి శ్రీమతి స్వర్ణలత మాట్లాడుతూ వేద విద్యను వ్యాప్తి చేస్తున్న ఇక్కడి అధ్యాపకులు, విద్యార్థుల కృషిని అభినందించారు.
ముందుగా వేదవిజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్‌ఎస్ అవధాని పీఠం చరిత్రను వివరించారు. ప్రస్తుతం 500 మంది విద్యార్థులు చదువుతున్నారని, 17 కోర్సులు ఉన్నాయని తెలిపారు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా స్నాతకోత్సవం జరగలేదని, ప్రస్తుతం 2019-20, 2020-21 సంవత్సరాలకు సంబంధించి 113 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశామని వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లతోపాటు వెండి డాలర్ అందజేశారు.
టిటిడి విద్యాశాఖాధికారి శ్రీ భాస్కర్‌రెడ్డి, ఇతర అధ్యాపకులు, వివిధ వైదిక విభాగాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.