BHOOMI PUJA OF JAMMU TEMPLE ON JUNE 13 _ జూన్ 13 న జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ – ఏర్పాట్ల పై అధికారులతో ఈవో సమీక్ష

Tirumala, 4 Jun. 21: The Bhoomi Puja for the construction of the Srivari temple at Majhin village in Jammu is scheduled on June 13 and in this connection TTD EO Dr KS Jawahar Reddy reviewed on the arrangements on Friday.

This review meeting took place in Sri Padmavathi Rest House in Tirupati. Engineering Officials gave power point presentation on the structure of temple, Mukha Mandapam, Vahana Mandapam, Potu, Veda Pathashala, Parking, Pilgrims Amenities Complex etc. and also on the electrical works.

Later EO directed the officials to divide the work and complete in two phases and take all measure to ensure that the outer wall surrounding the temple is in height.

He also instructed concerned on making the local arrangements for the Bhumi Puja.

JEO Smt Sada Bhargavi, FACAO Sri O Balaji, CE Sri Nageswara Rao, SE Sri Satyanarayana, EE Sri Narasimha Murty, Estate Officer Sri Mallikarjuna were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 13 న జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ
– ఏర్పాట్ల పై అధికారులతో ఈవో సమీక్ష

 తిరుమల 4 జూన్ 2021: జమ్మూ కు సమీపంలోని మజీన్ గ్రామం వద్ద జూన్ 13వ తేదీ శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం పద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఆలయంతో పాటు , ముఖమండపం, ప్రాకారం, శ్రీవారి పోటు, యాత్రికుల వసతిసముదాయం, వాహన మండపం, అర్చకులవసతి గృహం, సిబ్బంది వసతి గృహాలు, పార్కింగ్, వేద పాఠశాల, మల్టీ పర్పస్ షెడ్, భూమి చదును, విద్యుత్తు పనులు,నిర్మాణాలకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం ఈవో మాట్లాడుతూ, పనులను రెండు దశలుగా విభజించుకోవాలన్నారు. ఆలయం ప్రాంగణంలోని నిర్మాణాలన్నీ రాతితో చేయాలన్నారు. ప్రహరీ గోడ ఎత్తుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 13వ తేదీ స్థానికంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ఏ అండ్ సి ఏఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు,ఎస్ఈ శ్రీ సత్యనారాయణ,ఈ ఈ శ్రీ నరసింహ మూర్తి, డిప్యూటి ఈవో శ్రీ రమేష్ బాబు, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ మల్లి ఖార్జున పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది