EO INSPECTS SV GOSALA _ ఎస్వీ గోశాల‌ను త‌నిఖీ చేసిన టిటిడి ఈవో

Tirupati, 30 Jun. 21: TTD EO Dr KS Jawahar Reddy on Wednesday evening inspected SV Gosamrakshanasala in Tirupati.

The Gosala Director Dr Harinath Reddy explained about the number of cattle, the process of feeding of fodder to EO.

The EO also inspected the products made out of Panchagavya, Agarbatti shed, Fodder godown, new arch under construction in SV Gosala.

CE Sri Nageswara Rao, SEs Sri Jagadeeshwar Reddy, Sri Venkateswarulu, DE Sri Ravishankar Reddy were also present.

EO VISITS RSVP LIBRARY

Earlier EO visited National Sanskrit University (Rastriya Sanskrit Vidya Peetham) and seen the ancient manuscripts in the library.

He had a glance of Krishi, Gaja, Vriksha, Aswa Sastras penned by Sri Parasara Maharshi. He sought Varsity VC Prof. Muralidhara Sharma to bring to light the ancient Indian farming tactics in the form of a book and also urged him to enlighten public on Vrishabha festival that is being observed in the holy month of Karthika every year.

Varsity Registrar Sri Venkateswarulu was also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీ గోశాల‌ను త‌నిఖీ చేసిన టిటిడి ఈవో

తిరుప‌తి, 2021జూన్ 30: తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌ర గోసంర‌క్ష‌ణ‌శాల‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను బుధ‌వారం టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి త‌నిఖీ చేశారు.

ఈ సంద‌ర్భంగా స్వామివారికి వాడిన పుష్పాలు, అదేవిధంగా పంచ‌గ‌వ్యాల‌తో కూడిన మిశ్ర‌మంతో అగ‌ర‌బ‌త్తిల త‌యారీకి ఏర్పాటు చేస్తున్న షెడ్డు, ప‌శువుల దాణా గోడౌన్‌, దాణా మిక్సింగ్ ప్లాంటుల‌ను ఈవో అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. అనంత‌రం గోశాల‌లోనికి ప్ర‌వేశించేందుకు నూత‌నంగా ఏర్పాటు చేసిన రోడ్డు, ఆర్చిల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. మొత్తం గోశాలలో ప‌శువుల సంఖ్య‌, వాటికి అందిస్తున్న‌ దాణా వివ‌రాలు గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రినాథ‌రెడ్డి, ఈవోకు వివ‌రించారు. త‌రువాత‌ ఇంజినీరింగ్ అధికారులు గోశాలలో చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఈవోకు వివ‌రించారు.

ఈవో వెంట సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ ఇ శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఎస్ ఇ ఎల‌క్ట్రిక‌ల్ శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, డిఇ శ్రీ ర‌వికుమార్‌రెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో ….

అంత‌కుముందు ఈవో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలోని లైబ్ర‌రీలో భ‌ద్ర‌ప‌రిచిన అతి ప్రాచీన తాళ‌ప‌త్ర గ్రంథాల‌ను, డిజిట‌లైజేష‌న్ చేయు విధానంను ప‌రిశీలించారు. ఈ గ్రంథాల్లో వేదాలు, ఉప‌నిష‌త్తులు, జ్యోతిశాస్త్రం, ఆయుర్వేదం, రామాయ‌ణం, మ‌హాభార‌తం, మ‌ను ధ‌ర్మ‌శాస్త్రం త‌దిత‌ర పురాత‌న‌ గ్రంథాలు ఉన్నాయి.

ఈ సంద‌ర్బంగా ప‌రాశ‌ర మ‌హ‌ర్షి చెప్పిన వ్య‌వ‌సాయ ప‌ద్ద‌తులు, గ‌జ శాస్త్రం, అశ్వ శాస్త్రం, వృక్ష శాస్త్రం, క్రిషి శాస్త్రం, ఆయుర్వేదం, దేశీయ విత్త‌నాల మీద రైతుల‌కు అవ‌గాహ‌ణ క‌ల్పించేందుకు పుస్త‌క రూపంలో అందివ్వాల‌ని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళిధ‌ర్ శ‌ర్మ‌ను ఈవో కోరారు. అదేవిధంగా ప్ర‌తి ఏడాది కార్తీక మాసంలో వృష‌భాల‌కు సంబంధించిన పండుగ వృష‌భోత్స‌వంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌ణ క‌ల్పించాల‌ని విద్యాపీఠం అధికారుల‌కు సూచించారు.

ఈ కార్యక్ర‌మంలో రిజిష్ట‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.