13TH EDITION OF BALAKANDA AKHANDA PARAYANAMS ON NOV 6 _ న‌వంబ‌రు 6న 13వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయ‌ణం

Tirumala,5, November 2022: For the well-being of humanity, TTD is organizing the 13th edition of Balakanda Akhanda Parayanams at Nada Niranjanam platform in Tirumala on November 6  and the program will be live telecast by the SVBC channel.

In all parayanams of 137 shlokas of 61-65 sargas will be performed by the TTD Vedic pundits, SV Veda Vijnan Peetham, SV Veda university, TTD honorarium pundits and pundits from the national Sanskrit university and Annamacharya project.

TTD has appealed to devotees across the world to participate in the sacred parayanams live telecast by the SVBC.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

న‌వంబ‌రు 6న 13వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయ‌ణం

తిరుమల, 2022 నవంబరు 05: లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై న‌వంబ‌రు 6న ఆదివారం 13వ విడ‌త‌ బాలకాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

బాలకాండలోని 61 నుండి 65 సర్గల వ‌ర‌కు గ‌ల 137 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.