ALLOCATE ROOMS AT VISHNU NIVASAM FROM SATURDAY ONWARDS- TTD JEO _ శనివారం నుంచి విష్ణునివాసం లో గదుల కేటాయింపునకు చర్యలు అధికారులకు జెఈవో శ్రీమతి సదాభార్గవి ఆదేశం
Tirupati, 09 September 2021: TTD JEO Smt Sada Bhargavi has directed the officials concerned to commence allotment of rooms at Vishnu Nivasam rest house near the Railway station to devotees from Saturday, the September 11 onwards.
In this connection, the JEO visited Vishnu Nivasam and inspected the rooms and reception centres and gave valuable suggestions to officials on cleaning, sanitation and covid measures to be taken while allotting rooms.
It may be mentioned here that room allotments at Vishnu Nivasam was temporarily stopped by TTD since the beginning of the pandemic Covid season and it was converted to a Covid care centre and handed over to district administration.
Speaking on the occasion the JEO directed engineering officials to keep signboards at every floor near the lifts about rooms and also on local temples and to enhance the external ambience of Vishnu Nivasam. TTD is already operating buses for local temples for devotees to benefit from the Srinivasam rest house.
She directed IT officials to allocate 50% of rooms for online booking to devotees at Vishnu Nivasam and 50% for offline allotments from Saturday onwards.
The JEO also visited the 2&3 choultries behind the railway station and directed officials to keep the premises clean and hygienic.
EEs Sri Krishna Reddy, Smt Sumati, DyEE Sri Jogaiah, SMO Dr Kusuma, AEO Smt Sitamahalakshmi were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శనివారం నుంచి విష్ణునివాసం లో గదుల కేటాయింపునకు చర్యలు
అధికారులకు జెఈవో శ్రీమతి సదాభార్గవి ఆదేశం
తిరుపతి 9 సెప్టెంబరు 2021: రాబోయే శనివారం నుంచి భక్తులకు విష్ణు నివాసం లో గదులు అందుబాటులోకి తేవాలని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గత కొంత కాలంగా కోవిడ్ వల్ల విష్ణునివాసం గదుల కేటాయింపు తాత్కాలికంగా నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఆమె విష్ణు నివాసం వసతి సముదాయం లోని గదులు, రిసెప్షన్ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులతో మాట్లాడుతూ, ప్రతి ఫ్లోర్లో లిఫ్ట్ ఎదురుగా గదుల సమాచారం తెలిపే వివరాలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా స్థానిక ఆలయాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసే బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమాచారం తెలియడం వల్ల భక్తులు సులభంగా స్థానిక ఆలయాలకు వెళ్ళే అవకాశం ఉంటుందని జెఈఓ చెప్పారు. శ్రీనివాసం నుంచి టూరిజం శాఖ స్థానిక ఆలయాలకు బస్సులు నడుపుతున్న విషయం విదితమే. విష్ణు నివాసంలో 50 శాతం గదులు భక్తులకు ఆన్ లైన్ ద్వారా కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని ఐటి అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా విష్ణు నివాసం చుట్టూ మొక్కలు నాటి, ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. అనంతరం ఆమె రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడుతూ, శనివారం నుంచి గదులు కేటాయించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
అనంతరం ఆమె రైల్వే స్టేషన్ వెనుక ఉన్న 2, 3 సత్రాలను పరిశీలించారు. కోవిడ్ కారణంగా ఈ సత్రాలు భక్తులకు తాత్కాలికంగా కేటాయించనందువల్ల చిన్నపాటి మరమ్మతులకు గురికావడం, పిచ్చి మొక్కలు పెరిగి ఉండటం గమనించారు. గదుల మరమ్మతులు త్వరగా చేయించి పిచ్చి మొక్కలు తొలగించి ఈ ప్రాంతాన్ని సుందరంగా తయారుచేయాలని ఆదేశించారు. ప్రస్తుతానికి మూడవ సత్రంలోని గదులు భక్తులకు అందుబాటులోకి తేవాలని, ఈ లోపు రెండవ సత్రంలో మరమ్మతులకు గురైన గదుల పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు.
చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సందీప్, ఈఈ లు శ్రీ కృష్ణా రెడ్డి, శ్రీమతి సుమతి, డిప్యూటీ ఈ ఈ శ్రీ జోగయ్య, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ, విష్ణు నివాసం ఏ ఈ ఓ శ్రీమతి సీతామహాలక్ష్మి ఈ పర్యటనలో పాల్గొన్నారు.
టిటిడి ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది