JEO REVIEW ON VIZAG SRIVARI TEMPLE KUMBHABHISHEKAM _ విశాఖలో శ్రీవారి ఆలయ కుంభాభిషేకం ఏర్పాట్లపై జెఈవో సమీక్ష
Tirupati, 15 February 2022: TTD JEO Sri Veerabrahmam on Tuesday directed officials to complete all arrangements for the scheduled Kumbhabisekam at the newly built Sri Venkateswara temple at Vishakhapatnam.
Addressing a review meeting at the conference hall of the TTD Administrative Building on Tuesday afternoon the JEO instructed officials to commence daily puja and other kaikaryas in the temple from the day of Kumbhabisekam itself.
He said on the last day of the five-day long Kumbhabisekam festivities at Visakhapatnam, Srivari Kalyanotsavam would be performed.
He said besides the main temple, the construction of other sub-temples of Sri Andal, Sri Padmavati and Sri Anjaneya were also completed and the construction of staff quarters was only pending.
The JEO instructed officials that in consultation with the district administration the approach road works should be completed a week ahead of the Kumbhabisekam.
He also advised officials to take up greenery and landscaping works around the temple in consultation with Visakhapatnam urban development authorities and also organise attractive electrical and floral decorations.
Among others, he asked officials to organise adequate parking facility in consultation with local police, cultural programs by HDPP artists, departments to prepare a checklist of works for Kumbhabisekam and monitor daily progress of works.
He also urged officials of all wings to jointly conduct sport inspection soon abs take up necessary actions.
The JEO said the adequate number of Archakas, FMS, Security, Canteen personnel should be deputed besides making arrangements for their stay, food etc.
Agama advisor Sri Vedantam, Vishnu Bhattacharyulu, SEs Sri Satyanarayana, Sri Venkateshwarlu, DyEOs Sri Ramana Prasad, Sri Govindarajan, Sri Vijaya Saradhi, Additional Health Officer Dr Sunil Kumar, VGO Sri Manohar, Marketing GM Sri Subramaniam and others were present.
INSPECTION OF SSD TOKEN COUNTERS AT TIRUPATI
The JEO Sri Veerabrahmam also inspected the SSD token counters at Srinivasam, Bhudevi complex, Govindarajaswami choultries and also interacted with devotees in the counters
On appeal by some devotees from Rumania, the JEO advised officials to make arrangements for the issue of SSD tokens to foreign devotees also.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
విశాఖలో శ్రీవారి ఆలయ కుంభాభిషేకం ఏర్పాట్లపై జెఈవో సమీక్ష
తిరుపతి, 2022 ఫిబ్రవరి 15: విశాఖపట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానం కుంభాభిషేకం త్వరలో జరుగనున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ ఆలయ కుంభాభిషేకం జరిగిన రోజు నుంచే పూజా కార్యక్రమాలు, కైంకర్యాలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఐదు రోజుల పాటు కుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహించి చివరిరోజు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ప్రధాన ఆలయంతోపాటు ఆండాళ్ అమ్మవారు, శ్రీ పద్మావతి దేవి అమ్మవారు, శ్రీ ఆంజనేయస్వామి ఉప ఆలయాల పనులు దాదాపుగా పూర్తయ్యాయని చెప్పారు. సిబ్బంది నివాస గృహాలకు రోడ్డు నిర్మాణం పెండింగ్‌లో ఉందని, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని కుంభాభిషేకానికి వారం రోజుల ముందే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలన్నారు. విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ అధికారులతో మాట్లాడి ఆలయంలో మొక్కలు, ఉద్యానవనాల పెంపకానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఆలయంలో కనువిందుగా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలన్నారు.
కుంభాభిషేకం సందర్భంగా వాహనాల పార్కింగ్‌కు, విఐపిల భద్రతకు ఇబ్బంది కలగకుండా స్థానిక పోలీసు అధికారులను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని జెఈవో ఆదేశించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా విష్ణుసహస్రనామ పారాయణం, హరికథ, అన్నమాచార్య సంకీర్తనల గానం తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి విభాగం అధికారులు కుంభాభిషేకానికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై చెక్‌లిస్టు తయారు చేసుకుని ప్రతిరోజూ పురోగతిని పరిశీలించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు త్వరలో సంయుక్తంగా ఆలయాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అర్చకులతోపాటు ఎఫ్ఎంఎస్, సెక్యూరిటీ, క్యాంటిన్ సిబ్బందిని తగినంత మందిని డెప్యుటేషన్‌పై పంపాలని, వారికి అవసరమైన వసతి, భోజనం తదితర ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
ఈ సమీక్షలో ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ఎస్ఇలు శ్రీ సత్యనారాయణ, శ్రీ వేంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీ రమణప్రసాద్, శ్రీ గోవిందరాజన్, శ్రీ లంక విజయసారథి, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్‌కుమార్, విజిఓ శ్రీ మనోహర్, మార్కెటింగ్ జిఎం శ్రీ సుబ్రమణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్వదర్శనం టోకెన్ కౌంటర్ల పరిశీలన
జెఈవో శ్రీ వీరబ్రహ్మం మంగళవారం ఉదయం తిరుపతిలోని శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల ఆవరణంలోని సర్వదర్శనం టోకెన్ కౌంటర్లను పరిశీలించారు. టోకెన్ల కోసం క్యూలో ఉన్న భక్తులతో మాట్లాడారు. రుమేనియా దేశానికి చెందిన భక్తులు తమకు దర్శన టోకెన్లు కేటాయించాలని జెఈవోను కోరారు. సంబంధిత అధికారులతో జెఈవో మాట్లాడి విదేశీ భక్తులకు దర్శన టికెట్లు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.