173rd AARADHANOTSAVAMS OF SRI THYAGARAJA SWAMY ON JAN 15 _ జ‌న‌వ‌రి 15న శ్రీ త్యాగ‌రాజ‌స్వామివారి 173వ ఆరాధ‌నోత్స‌వం

Tirupati, 13 Jan. 20: The TTD is organising the 173rd Aradhanotsavams of renowned Carnatic music exponent Saint Sri Thyagaraya at Tirupati on Pusya Bahula Panchami day on January 15.

The SV College of Music and Dance has made all the arrangements for the event as a part of Vaggyeakara Vaibhavam program.

The students and faculty of this Fine Arts College will present Pancha Ratna keertans of Sri Thyagaraya on the occasion. 

The students and faculty of Nadaswaram School and other music lovers of Tirupati will also participate in the event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

జ‌న‌వ‌రి 15న శ్రీ త్యాగ‌రాజ‌స్వామివారి 173వ ఆరాధ‌నోత్స‌వం

తిరుప‌తి, 2020 జనవరి 13: సుప్ర‌సిద్ధ వాగ్గేయకారుడు, కర్ణాటక సంగీత సామ్రాట్‌ శ్రీత్యాగరాజస్వామివారి 173వ ఆరాధనోత్సవాన్ని జనవరి 15వ తేదీ బుధ‌వారం తిరుపతిలో టిటిడి ఘనంగా నిర్వహించనుంది. శ్రీ‌త్యాగరాజస్వామివారు పుష్యబహుళ పంచమి నాడు పరమపదించారు.

టిటిడి శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాగ్గేయకార వైభవం కార్యక్రమంలో భాగంగా టిటిడి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో ఉదయం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు శ్రీత్యాగరాజస్వామివారి పంచ‌ర‌త్న కృతుల‌ను బృంద‌గానం చేస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌ళాశాల, నాద‌స్వ‌ర పాఠ‌శాల‌ అధ్యాప‌కులు, విద్యార్థులు, విశ్రాంత అధ్యాప‌కులు, స్థానిక క‌ళాకారులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.