TTD JEO (E&H) SETS DEADLINGES FOR DEVELOPMENT ACTIVITIES _ నవంబరు 17 నాటికి అగరబత్తుల తయారీ రెండవ యూనిట్ సిద్ధం చేయండి- టీటీడీ జేఈవో శ్రీమతి సదాభార్గవి

COMPLETE FEED MIXING PLANT BY DECEMBER 27

READY AGARBATTI SECOND UNIT BY NOVEMBER 1

Tirupati, 02 November 2022: TTD JEO (E& H) Smt Sada Bhargavi on Wednesday set new deadlines to TTD officials to complete ongoing works with respect to Feed Mixing Plant and Agarbattis manufacturing Unit.

She instructed officials to ensure the feed mixing plant at Sri Venkateswara Goshala in Tirupati to be set ready with equipment by December 27 and also that the second unit of agarbatti making plant to be installed before November 17.

Inspecting the ongoing works at SV Goshala including that of desi breed cows development, she went through the sheds, a different breed of desi animals and also the progress of works on feed mixing plant and ghee making units.

Addressing a review meeting with engineering officials TTD JEO urged officials to speed up works and reviewed progress on daily basis.

She also directed officials to put up a board with details of all bovines, their breed, health, feeding timings etc.

The JEO instructed officials to shift the deers in the Goshala to a separate enclosure in the SV Zoo park.

She urged officials to prepare an App to monitor the health of animals in the co-ordination of Gopalamitra given free to organic farmers 

Among others she also reviewed on training programs to highlight the significance of Gosamrakshana in Sanatana Hindu Dharma in other regions, breeding programs in co-ordination with Veterinary University and go Samrakshanashala, preparedness for generating 4000 litres of milk and 60 kgs of ghee needed daily at Srivari Temple, Gopuja at local TTD temples, Gudi ko Gomata program, organic farming, Gopradakshina mandiram, Nodal Goshalas, Panchagavya products. etc.

Go Samrakshanasala Director Dr Harnath Reddy, SE Sri Venkateswarlu, EE Sri Manoharam, Sri Murali Krishna, DEE Smt Supraja were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబరు 27 కు ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ సిద్ధం కావాలి
– నవంబరు 17 నాటికి అగరబత్తుల తయారీ రెండవ యూనిట్ సిద్ధం చేయండి
– టీటీడీ జేఈవో శ్రీమతి సదాభార్గవి

తిరుపతి 2 నవంబరు2022: శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ శాలలో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మాణం డిసెంబరు 27 వ తేదీకి యంత్రాలతో సహా సిద్ధం కావాలని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. అగరబత్తుల తయారీ రెండవ యూనిట్ నవంబరు 17వ తేదీకి సిద్ధం చేయాలన్నారు.

ఎస్వీ గోసంరక్షణ శాలలో జరుగున్న అభివృద్ధి పనులు, గోసంరక్షణ, దేశవాళీ గోవుల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను బుధవారం ఆమె పరిశీలించారు. గోవుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లు, గోజాతుల రకాలు, ఫీడ్ మిక్సింగ్, నెయ్యి తయారీ ప్లాంట్ల నిర్మాణాలను పరిశీలించారు.

అనంతరం అధికారులతో జేఈవో శ్రీమతి సదా భార్గవి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫీడ్ మిక్సింగ్, నెయ్యి తయారీ ప్లాంట్ల నిర్మాణం పనుల్లో వేగం పెంచాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈ పనుల ప్రగతిని రోజువారీగా తనకు తెలియజేయాలన్నారు. గోశాల లోని ప్రతి గోవు వద్ద అది ఏ జాతికి సంబంధించినది, దాని ఆరోగ్య పరిస్థితి, మేత, దాణా ఎప్పుడెప్పుడు అందిస్తారనే వివరాలు తెలుపుతూ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. గోశాలలోని జింకలను ఎస్వీ జూపార్కులో టీటీడీ నిర్మించిన ఎన్ క్లోజర్స్ కు తరలించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. గోఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు గోశాల ద్వారా అందిస్తున్న గోవులు, ఎద్దుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి గోపాల మిత్రల సేవలు వాడుకునే విషయం పరిశీలించాలని ఆమె చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ తయారు చేయాలని సూచించారు. తిరుపతి లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా గోసంరక్షణ, సనాతన హిందూ ధర్మంలో గోమాత ప్రాశస్యతను వివరించేలా క్షేత్రస్థాయిలో అవగాహన, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పిండమార్పిడి విధానంలో పశువైద్య విశ్వవిద్యాలయం, గోసంరక్షణ శాల భాగస్వామ్యం, నిర్వహణ గురించి చర్చించారు. టీటీడీకి రోజుకు అవసరమయ్యే నాలుగు వేల లీటర్ల పాలు, పెరుగు, మజ్జిగ, తిరుమలలో స్వామివారి దీపాలు, కైంకర్యాలకు అవసరమయ్యే 60 కిలోల నెయ్యి పూర్తి స్థాయిలో గోశాల లోనే తయారు చేసేలా సిద్ధం కావాలన్నారు. స్థానిక ఆలయాల్లో గోపూజ, గుడికో గోమాత, గోఆధారిత వ్యవసాయం, నోడల్ గోశాలలు, సప్త గోప్రదక్షిణ మందిరం లో చేయాల్సిన మరిన్ని పనులు, పంచగవ్య ఉత్పత్తుల తయారీలో గోశాల పాత్ర పై ఆమెసమీక్షించి పలు సూచనలు చేశారు.

గోసంరక్షణ శాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర్లు, ఈ ఈ శ్రీ మనోహర్, శ్రీ మురళీ కృష్ణ , డి ఈ ఈ శ్రీమతి సుప్రజ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల ఆధికారిచే జారీ చేయబడినది.