19TH BATCH OF ARCHAKA TRAINING CONCLUDES_ శ్వేతలో ముగిసిన 19వ బ్యాచ్‌ అర్చక శిక్షణ

Tirupati, 30 Jul. 18: The 19th batch of Archaka training concluded in SVETA building in Tirupati on Monday.

All Projects Special Officer of TTD, Sri N Muktheswara Rao who attended the valedictory session of the training class said, so far training has been imparted to 19 batches of SC,ST, BC and Fishermen community in Archakatva. From August 1 on wards we are contemplating training to more number of Archakas in Priesthood”, he added.

Later all the 29 persons who underwent training in 19th batch were given puja items, lamination photo of Lord along with the certificate.

HDPP Chief Sri Ramana Prasad was also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్వేతలో ముగిసిన 19వ బ్యాచ్‌ అర్చక శిక్షణ

తిరుపతి, 2018 జూలై 30: ధర్మప్రచారంలో భాగంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు నిర్వహించిన 19వ బ్యాచ్‌ అర్చక శిక్షణ తరగతులు సోమవారం ముగిశాయి. జూలై 16 నుండి 30వ తేదీ వరకు ఈ తరగతులు నిర్వహించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో ముగింపు కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీఎన్‌.ముక్తేశ్వరరావు మాట్లాడుతూ అర్చకుడు వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ధర్మాచరణ వైపు ప్రజలను నడిపించాలన్నారు. ఆలయాల్లో నిర్దేశించిన సమయంలో క్రమం తప్పకుండా క్రమశిక్షణతో పూజలు నిర్వహించాలని సూచించారు. అర్చక శిక్షణలో ధర్మం, దేవాలయం, అర్చకత్వం, అర్చకుడు – సమాజ భాగస్వామ్యం తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుండి 20వ బ్యాచ్‌ అర్చక శిక్షణ ప్రారంభంకానుందని, భవిష్యత్తులో మరింత ఎక్కువ మందికి అర్చక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. అనంతరం శిక్షణ పొందిన 29 మంది అర్చకులకు పూజాసామగ్రి, ధ్రువీకరణపత్రం, శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణప్రసాద్‌, అర్చక శిక్షణ కో-ఆర్డినేటర్‌ డా|| పమిడికాల్వ చెంచుసుబ్బయ్య పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.