20% ADDITIONAL ARRANGEMENTS FOR NAVARATHRI BRAHMOTSAVAMS _ న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో 20 శాతం అద‌నంగా ఏర్పాట్లు

Tirumala, 17 October 2026: Keeping in view the past experience  20 per cent additional arrangements have been made in Tirumala for the Sri Vari Navaratri Brahmotsavams to ensure a comfortable darshan experience for devotees, said TTD Chief Engineer Sri Manoharam.

Speaking at a media conference in the Media Centre of Ram Bagicha-2, Tirumala, on Saturday, he said all four Mada Streets around the temple have been systematically arranged, with beautifully painted Rangolis and decorations. 

New stainless steel railings have been installed at Srivari Pushkarini, while 120 additional mobile toilets have been provided for the festival.

He said a foot overbridge near Nandakam Rest House has eased traffic movement.

Planned parking facilities at various points in Tirupati have also enabled devotees to park conveniently and travel to Tirumala by bus, reducing congestion on the hill town.

TTD Electrical SE Sri Venkateswarlu said the electrical illuminations in Tirumala have been enhanced grandly, and LED screens have been installed in Tirumala and Tirupati for devotees to view the vehicle services.

SE 2 Sri Venugopal said all engineering arrangements were being made promptly to avoid inconvenience to devotees. 

Electrical DE Tirumala Sri Chandrasekhar said special illuminations depicting Srinivasa Kalyanam, Sri Rama Pattabhishekam, and the four aeons, installed opposite the temple, have been widely appreciated. Electrical staff worked for three months on the decorations, he added.

EE 1 Sri Srinivasa Rao said widened exit points on the Mada Streets have enabled devotees to leave comfortably after watching the vehicle services.

TTD CPRO Dr T. Ravi, EE Sri Sudhakar, and other officials attended the programme.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో 20 శాతం అద‌నంగా ఏర్పాట్లు

టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ మ‌నోహ‌రం

తిరుమ‌ల‌, 2026 అక్టోబ‌ర్ 17: శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు తిరుమ‌లలో 20 శాతం అద‌నంగా ఏర్పాట్లు చేసిన‌ట్లు టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ మ‌నోహ‌రం తెలిపారు. తిరుమ‌ల‌లోని రామ్ భ‌గీచా -2 లోని మీడియా సెంట‌ర్ లో శ‌నివారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. 

శ్రీ‌వారి ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప‌గ‌డ్భందీగా ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. మాడ వీధుల్లో రంగ‌వ‌ల్లుల‌ను అత్యంత సుంద‌రంగా పెయిటింగ్ వేయ‌డం జ‌రిగింద‌న్నారు. శ్రీ‌వారి పుష్క‌రిణిలో నూత‌నంగా ఎస్ఎస్ రెయిలింగ్ చేసిన‌ట్లు తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా అద‌నంగా 120 మొబైల్ టాయిలెట్లు అందుబాటులో ఉంచామ‌ని తెలిపారు. నందకం విశ్రాంతి భ‌వ‌నం వ‌ద్ద ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయ‌డంతో ట్రాఫిక్ త‌గ్గింద‌ని తెలియ‌జేశారు. తిరుపతిలో వివిధ ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా పార్కింగ్ ఏర్పాట్లు చేయడంతో భక్తులు సౌకర్యవంతంగా పార్కింగ్ చేసి బస్సుల్లో తిరుమలకు రావడంతో తిరుమలలో ట్రాఫిక్ సమస్య తగ్గిందని చెప్పారు.

ఎల‌క్ట్రిక‌ల్ ఎస్ఈ శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ తిరుమ‌ల‌లో విద్యుత్ అలంక‌ర‌ణ‌ల‌ను అత్యంత శోభాయ‌మానంగా తీర్చిదిద్దిన‌ట్లు తెలిపారు. తిరుమ‌ల‌, తిరుప‌తిలో వాహ‌న సేవ‌ల‌ను భ‌క్తులు ప్ర‌త్య‌క్షంగా వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

ఎస్ఈ శ్రీ వేణుగోపాల్ మాట్లాడుతూ భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఎప్ప‌టికప్పుడు అన్ని ఇంజినీరింగ్ ఏర్పాట్లు చేశామ‌ని తెలిపారు. తిరుమ‌ల‌లో పార్కింగ్ స్థ‌లాల‌ను ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఏర్పాటు చేశామని చెప్పారు.

ఎల‌క్ట్రిక‌ల్ డిఈ శ్రీ చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ ఆల‌య ప్రాకారానికి ప్ర‌త్యేక విద్యుత్ అలంక‌ర‌ణ‌లు చేశామ‌ని చెప్పారు. ఆల‌యానికి ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీ‌నివాస క‌ల్యాణం, శ్రీ‌రామ ప‌ట్టాభిషేక ఘ‌ట్టం, నాలుగు యుగాల కాన్సెప్ట్ తో రూపొందించిన‌ విద్యుత్ అలంక‌ర‌ణల‌కు భ‌క్తుల నుండి విశేస ప్ర‌శంస‌లు వ‌చ్చాయ‌ని తెలిపారు. విద్యుత్ విభాగం సిబ్బంది మూడు నెల‌ల పాటు శ్ర‌మించి తిరుమ‌ల‌లో విద్యుత్ అలంక‌ణ‌లు చేప‌ట్టార‌ని తెలిపారు.

ఈఈ శ్రీ శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ మాడ వీధుల్లో ఎగ్జిట్ పాయింట్ల‌ను వెడ‌ల్పు చేయ‌డంతో వాహ‌న సేవ‌లు వీక్షించిన అనంత‌రం భ‌క్తులు సౌక‌ర్య‌వంతంగా వెలుప‌ల‌కు వ‌చ్చార‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ సీపీఆర్వో డాక్ట‌ర్ టి.ర‌వి, ఈఈ శ్రీ సుధాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డింది.