PANCHAGAVYADHIVASAM HELD IN JAMMU _ జమ్మూలో శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం

TIRUMALA, 05 JUNE 2023: As part of Maha Samprokshanam festivities in Srivari temple in Majin village on the banks of Tavi(River Suryaputri) at Jammu, Panchagavyadhivasam ritual was observed on Monday.

The significance of this Agamic ritual is to sanctify the chief deity idol with the five important Desi Cow ingredients viz. cow dung, urine, milk, curd and ghee. The sculptors carve the idol of the deity of out of a raw rock giving it a beautiful form with sculpting tools. This ritual is observed to give a soothing relief to the deity from the strokes during sculpting. As part of this, Akshinmochanam, Navakalasa Snapanam were performed by the Archakas. In the evening, Vaidika rituals will be observed in the Yagasala.

One of the chief priests of Tirumala temple Sri Venugopala Deekshitulu, Kankanabhattar Sri Ramakrishna Deekshitulu, DyEOs Sri Gunabhushan Reddy, Sri Sivaprasad, EE Sudhakar, DyEEs Sri Raghuvarma, Sri Chengalrayalu, AEO Sri Krishna Rao, AE Sri Sitaramaraju, Superintendent Sri Subrahmanyam, Temple Inspector Sri Saikrishna were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

 
జమ్మూలో శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం
 
జమ్మూ, 05 జూన్ 2023: జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం శాస్త్రోక్తంగా పంచగవ్యాధివాసం నిర్వహించారు.
 
వైదిక కార్యక్రమాల్లో భాగంగా బింబశుద్ధి కోసం పంచగవ్యాధివాసం చేపట్టారు. ముడిశిలను శిల్పులు చాకచక్యంగా స్వామి, అమ్మవార్ల విగ్రహాలుగా మలుస్తారు. ఈ క్రమంలో సుత్తి, ఉలి దెబ్బలకు వేదనకు గురయ్యే విగ్రహాలకు ఉపశమనం కల్పించడం కోసం పంచగవ్యాలైన పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రంతో అభిషేకం చేశారు. ముందుగా అక్షిణ్మోచనం, నవకలశస్నపనం నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు.
 
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాలదీక్షితులు, కంకణభట్టార్ శ్రీ రామకృష్ణ దీక్షితులు, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ శివప్రసాద్, ఇఇ శ్రీ సుధాకర్, డెప్యూటీ ఇఇ శ్రీ రఘువర్మ, డెప్యూటీ ఇఇ(ఎలక్ట్రికల్) శ్రీ చెంగల్రాయలు, ఏఈవో శ్రీ కృష్ణారావు, ఏఈ శ్రీ సీతారామరాజు, సూపరింటెండెంట్ శ్రీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.