వైభవంగా ప్రారంభమైన శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు
వైభవంగా ప్రారంభమైన శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, మే 16, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం 6.30గం||లకు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. మే 17వ తేది శుక్రవారం ఉదయం 10.00గం||ల నుండి 10.20 గం||ల మద్య కర్కాటక లగ్నం నందు ధ్వజారోహణం వైభవంగా జరగనుంది.
తేదీ ఉదయం సాయంత్రం
17-05-13(శుక్రవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం
18-05-13(శనివారం) చిన్నశేష వాహనం హంస వాహనం
19-05-13(ఆదివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
20-05-13(సోమవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
21-05-13(మంగళవారం) మోహినీ అవతారం గరుడ వాహనం
22-05-13(బుధవారం) హనుమంత వాహనం గజ వాహనం
23-05-13(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
24-05-13(శుక్రవారం) రథోత్సవం అశ్వవాహనం
25-05-13(శనివారం) చక్రస్నానం ధ్వజావరోహణం
హిందూ ధర్మప్రచారపరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, శ్రీగోవిందరాజస్వామి పుష్కరిణి, శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద ఆధ్యాత్మిక,భక్తిసంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.