BHOGI THERU ON JANUARY 14 _ శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 14న భోగితేరు, 15న మకరసంక్రాంతి

MAKARA SANKRANTI ON JANUARY 15

 

Tirupati, 13 January 2024:    In connection with the Sankranti festivities, Bhogi Teru and Makarasankranti festivals will be held on January 14 and January 15 respectively at Sri Govindaraja Swamy temple in Tirupati.

 

On January 14, on the day of Bhogi festival, from 5.30 pm to 7 pm, a procession of Sri Andal Ammavaru and Sri Krishna Swamy will be carried out.

 

Sankranti Tirumanjanam will be performed in the morning on the auspicious occasion of Makara Sankranti on January 15.

 

At 6.30 a.m. from the temple, the Chakratalwar is taken out on a procession to Sri Alwar Theertha in Kapilatheertham.

 

Between 5.30 pm and 7 pm Sridevi and Bhudevi together with Sri Govindaraja Swamy will parade along Mada streets.

 

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 14న భోగితేరు, 15న మకరసంక్రాంతి

తిరుప‌తి, 2024 జనవరి 13: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో జనవరి 14న భోగితేరు, జ‌న‌వ‌రి 15న మకరసంక్రాంతి ప‌ర్వ‌దినాలు జరుగనున్నాయి.

జనవరి 14న భోగి పండుగ రోజున సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహిస్తారు.

జనవరి 15న మకర సంక్రాంతి సంద‌‌ర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం చేపడతారు. ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఆల‌యం నుండి చ‌క్ర‌త్తాళ్వార్‌ను ఊరేగింపుగా క‌పిల‌తీర్థంలోని శ్రీ ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. అక్క‌డ చ‌క్ర‌స్నానం అనంత‌రం ఆస్థానం చేప‌డ‌తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజస్వామివారు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.