HANUMANTA VAHANAM HELD _ హనుమంత వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వైభవం

TIRUPATI, 21 MAY 2024: As part of the ongoing annual Brahmotsavam in Sri Govindaraja Swamy temple in Tirupati, Hanumanta Vahana Seva was observed.

Devotees were enthralled to see Vahana Seva.

Earlier in the morning Snapana Tirumanjanam held to deities.

Both the Tirumala Pontiffs, Agama advisors, DyEO Smt Shanti and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హనుమంత వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వైభవం
 
తిరుపతి, 2024 మే 21: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం ఉదయం 7 గంటలకు శ్రీ‌ గోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
 
భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
 
త్రేతాయుగంలో రామభక్తునిగా ప్రసిద్ధిగాంచినవాడు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్త్వాన్ని బోధించినట్టు ప్రాచీనవాఙ్మయం నుండి తెలుస్తోంది.  బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి.  శరణాగతికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.
 
అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేశారు. 
 
మధ్యాహ్నం 3 గంటలకు   వసంతోత్సవం వైభవంగా జరగనుంది. అనంతరం  శ్రీవారు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
 
వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆగమ సలహాదారులు శ్రీ సీతారామాచార్యులు, శ్రీ మోహన రంగాచార్యులు, 
ఆల‌య  డెప్యూటి ఈవో శ్రీమతి శాంతి సూపరింటెండెంట్ శ్రీ నారాయణ,
విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.