JYESTABHISEKAM FETE IN SRI GT FROM JULY 16-18 _ జూలై 16 నుండి 18వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం

Tirupati,07 July 2024: TTD is organising the annual fete of Jyestabisekam (Abhideyaka Abhisekam) at Sri Govindarajaswami temple from July 16 to July 18.

The special event is observed every year in the Jyesta Nakshatra in Ashada Masam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూలై 16 నుండి 18వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం

తిరుపతి, 2024 జూలై 07: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జూలై 16 నుండి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం(అభిధేయక అభిషేకం) జరుగనుంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు ఏడాదికోసారి స్వర్ణకవచాలను తొలగించి శుద్ధి చేసి తిరిగి అమర్చుతారు.

ఇందులో భాగంగా జూలై 16న కవచాధివాసం, జూలై 17న కవచ ప్రతిష్ఠ, జూలై 18న కవచ సమర్పణ నిర్వహిస్తారు. ఈ ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం చేపడతారు. ఉదయం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం శతకలశ స్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఏడాదీ ఆషాడ మాసం, జ్యేష్ఠా నక్షత్రం రోజున ఆలయంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.