TALLAPAKA ANNAMACHARYA SANKEERTANS NEEDS COMPOSITION – TTD EO _ నవతరానికి మరింతగా తాళ్ళపాక అన్నమాచార్యులు కీర్తనలను అందించాలి – టిటిడి ఈవో శ్రీ జె.శ్యామల రావు
నవతరానికి మరింతగా తాళ్ళపాక అన్నమాచార్యులు కీర్తనలను అందించాలి – టిటిడి ఈవో శ్రీ జె.శ్యామల రావు
తిరుపతి, 2025, మార్చి 18: నవతరానికి అనువుగా ఉండేలా, జనబాహుళ్యంలోకి మరింతగా తాళ్ళపాక అన్నమాచార్యులు కీర్తలను తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మను ఈవో ఆదేశించారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆద్వర్యంలో టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు బెంగళూరు , చెన్నైకి చెందిన గాయకులు, సంగీత దర్శకులతో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తాళ్ళపాక అన్నమాచార్యులు వారి 32,000 కీర్తనలలో ఇప్పటి వరకు 14,932 కీర్తనలను టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఇందులో 4,750 కీర్తనలను ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ రికార్డ్ చేసి 4,610 కీర్తలను టిటిడి వెబ్ సైట్ లో పొందుపరిచారన్నారు. మిగిలిన 140 కీర్తనలను త్వరలో వెబ్ సైట్ లో పొందుపరుచుతామన్నారు. మొదటి దశలో 290 సంకీర్తనలతో 29 సీడీలను పూర్తి చేయగా, రెండవ దశలో ఇప్పటికే 210 సంకీర్తనలతో 21 సీడీలను రూపొందించారని, మరో 130 సంకీర్తనలతో మిగిలిన 13 సీడీలను త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మూడవ దశలో 340 సంకీర్తలను సీడీల రూపంలో తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అన్నమాచార్యుల వారి సంకీర్తలను రాగం నియమాలకు కట్టుబడి లలితంగా, శాస్త్రీయంగా, జనరంజకంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అన్నమయ్య కీర్తలనలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారని, పాతతరాన్ని, కొత్త తరాన్ని జోడించి మరింత లయబద్ధంగా కీర్తలను రూపొందించాలని గాయకులను కోరారు. టిటిడి వెబ్ సైట్ లో సులభతరంగా అన్నమయ్య కీర్తలను గుర్తించేలా చర్యలు తీసుకోవాలనికోరారు . మరింత నాణ్యంగా అన్నమయ్య కీర్తలను అందించేలా ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఆర్వో డా. టి. రవి, పలువురు గాయకులు, సంగీత దర్శకులు, అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirupati, 18 March 2025: Make more compositions for the remaining songs of Sri Tallapaka Annamacharya for the sake of future generations, said TTD EO Sri J Syamala Rao.
A meeting with renowned musicians was held in the Conference Hall of TTD Admin. Building in Tirupati on Tuesday evening.
Directing the SV Recording Project Special Officer Dr. A Vibhishana Sharma, the EO said need to take measures to bring the keertans of Tallapaka Annamacharya to the masses in a big way.
Speaking on this occasion, EO said that TTD has made available 14,932 keertans of Tallapaka Annamacharya out of 32,000 compositions.
Of this, 4,750 keertans were recorded by the SV Recording Project and 4,610 sankeertans were uploaded on the TTD website. The remaining 140 works will be uploaded on the website soon.
He said that while 29 CDs with 290 Sankeertans have been completed in the first phase, 21 CDs with 210 Sankeertans have already been made in the second phase and the remaining 13 CDs with another 130 Sankeertans will be made available to the devotees soon.
In the third phase, he ordered to take steps to bring 340 Sankirtas in the form of CDs.
Plans are being made to make Annamacharya Sankeertans elegant, and popular by adhering to the rules of Raga. Annamaiah Sankeertan have crores of fans all over the world and asked the renowned singers and music directors to create more attractive compositions involving the old generation and the new generation composers.
Steps should be taken to make it easy to identify Annamaiah keertans on the TTD website. A committee will be formed to provide more quality Annamaiah kritis, he maintained.
In this meeting, CPRO Dr. T. Ravi, many singers, music directors from Andhra Pradesh, Telangana Karnataka and Tamilnadu, and other officials participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI