SRI RAMA PATTABHISHEKAM HELD IN SRI KRT _ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

Tirupati, 08 April 2025: On Tuesday evening, the celestial Coronation Ceremony of Sri Rama was held in the ancient temple of Sri Kodandarama in Tirupati.

Earlier during the day,  waters from the sacred Narasimha Theertham were brought and Abhishekam was performed to the deities.

Later in the night, Sri Rama Pattabhisheka Asthanam was performed.

DyEOs Sri Govindarajan, Smt Nagaratna and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

తిరుపతి, 2025 ఏప్రిల్ 08: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తులను ఊంజల్‌ మండపానికి వేంచేపు చేశారు. అనంతరం నరసింహతీర్థం నుండి తెచ్చిన తీర్థంతో శ్రీకోదండరామునికి అభిషేకం చేశారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ట, చతుర్దశ కలశస్నపన తిరుమంజనం నిర్వహించారు.

రాత్రి 7 గంటల నుండి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవోలు శ్రీ గోవింద రాజన్, శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ ర‌వి, సూపరింటెండెంట్‌ శ్రీ మునిశంక‌ర్‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.