294TH BIRTH ANNIVERSARY OF MATRUSRI TARIGONDA VENGAMAMBA _ మే 22న తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు

Tirumala, 13 May 2024: The 294th birth anniversary celebrations of  Matrushri Tarigonda Vengamamba will be celebrated in Tirumala on May 22.  

Also observed at Vengamamba’s birthplace in Tarigonda besides Tirumala and Tirupati.

As part of it, Pushpanjali will be offered at Vengamamba Vrindavanam in Tirumala on May 22 at 4.30 pm.  

At 5.30 in the evening, Srivaru along with Ubhayanancharulu will take a procession through the streets to reach Sri Padmavathi Venkateswara Parinayotsava Mandapam in Narayangiri Gardens in, Tirumala.  

From 6 to 7 pm, artists of the Annamacharya project will conduct a Gosthiganam of Tarigonda Vengamamba Sankirtanas.  

Sri Sri Sri Swarupananda Swamiji of Visakha Sarada Peetham will deliver the Anugraha Bhashanam on the occasion.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 22న తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు

తిరుమల, 2024 మే 13: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు మే 22వ తేదీన తిరుమలలో వైభవంగా జరుగనున్నాయి. వెంగమాంబ స్వస్థలమైన తరిగొండ, తిరుమల, తిరుపతి దివ్యక్షేత్రాలలో జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.

మే 22వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానంలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర పరిణయోత్సవ మండపానికి ఉభయనాంచారీ సమేతంగా శ్రీవారు పురవీధుల గుండా వేంచేపు చేస్తారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామిజీ అనుగ్రహభాషణం చేయనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.