4th ANNUAL FORMATION DAY CELEBRATIONS OF S.V.VEDIC UNIVERSITY _ వేద‌ సంరక్షణతోనే లోక సంరక్షణ – మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ శ్రీ రామేశ్వర్‌ ఠాకూర్‌

Tirupati, 12 July 2010: The concepts of Vedas are vasudaika Kutumbam told His Excellency, the Governor of Madhya Pradesh Dr. Rameshwar Takurji. He has attended as Chief Guest in the fourth formation day celebrations of S.V. Vedic University, Tirupati on Monday morning.

 Speaking on the occasion, the Governor said that the Vedic sages like Vasista, Vamadeva, Viswamitra, Sandilya interpreted and propagated the Vedas that contain not only the scientific theories, but also the Philosophical teachings. That is why the followers of Vedic path shall ever remain happy where they remain in this world or elsewhere.

 The scriptures like – Bruhat Samhita of varahamihira contains simple scientific theories related to astronomy, astrology, geology, hydrology etc., he added. Further he said that lot of Vedic and scientific literature is yet to be deciphered, the University must take a project to identify such manuscripts and to edit and publish them for the benefit of the country. The University should also try to introduce as many Vedic sciences as possible in its curriculum. Electronic advancement should successfully be utilized in the mission of preserving and propagating the Vedas and Vedanta’s. At the same time, proper attention must be paid to strengthen the tradition of oral transmission of Vedas. Steps must be taken for the revival of endangered branches of Vedas wherever they are. The Vedic University library should contain any book written on Vedas in any language. Foreign scholars should approach this University for their advanced researches. He said that his dream and aim that Sri Venkateswara Vedic University should raise to the international level. A dedicated endeavour in this direction shall definitely make our country, the leader. 

 Later, the Governor has released Books such as Sri Venkateswara Vaibhavam (Srinivasa Kalyanam), Bruhati, Sankarshanakanda, Nayadyumani, Samavedhana Brahmanam, Mokshopaya Pradeepika, Kalamrutam, Pratishthavidhidarpana, Smarthapaddativivechanika, A study of Sanskrit Inscriptions in Andhra Pradesh and University first Souvenir Vedapravrttih on this occasion. Earlier, the Veda Pundits have performed Sudarshana Homam, Maha Ganapathi Homam, Navagraha Homam, Vaasthu Homam, and Rudrabhishekam at the campus for the well being of the society, especially for the development of the university.

 Sri A.P.V.N.Sarma, Former Executive Officer, Sri M.G. Gopal, I.A.S, Dr. N.Yuvaraj, I.A.S, Joint Executive Officer and Registrar of the University, Prof. S.S.Sarma, Vice-Chancellor, Sri Vishnu Bhattacharya, Dean Vedic University and students took part.

వేద‌ సంరక్షణతోనే లోక సంరక్షణ – మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ శ్రీ రామేశ్వర్‌ ఠాకూర్‌

తిరుపతి, 2010 జూలై 12: వేదాల సంరక్షణతోనే లోక సంరక్షణ జరుగుతుందని మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ శ్రీ రామేశ్వర్‌ ఠాకూర్‌ తెలిపారు.

సోమవారం ఉదయం శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో జరిగిన చతుర్థ వార్షిక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం మొత్తం ఒక వసుదైక కుటుంబమని అన్నారు. శతాబ్ధాల క్రితం ఈ విశ్వాన్ని మొత్తం వేదాలు శాసించాయని అదేవిధంగా మహర్షులైన వశిష్ట, వామదేవ, విశ్వామిత్ర, శ్యాడిల్య లాంటి గొప్ప ఋషులు వేదసారాన్ని, వేదవిజ్ఞానాన్ని తమతమ ఉపన్యాసాల ద్వారా ప్రజలకు చేరువచేయడానికి ప్రయత్నించారని తెలిపారు.

భరద్వాజులు రచించిన విమానశాస్త్రం, ఆర్యభట్ట రచించిన గణిత శాస్త్రం ఇప్పటికి ఆధునిక శాస్త్రవేత్తలు ఒక గొప్ప ఆద్భుతమైన శాస్త్రములుగానే పరిగణిస్తున్నారని ఆయన అన్నారు. ఈ వేదవిశ్వవిద్యాలయం అటువంటి గొప్ప గొప్ప శాస్త్రాలను, శాసనాలను, గొప్ప గొప్ప రచనలను సమీకరించి గ్రంథాలయాలలో ఉంచుకోవాలని, అదేవిధంగా ఎక్కువ శాతం వేదాలపై పరిశోధనలు జరగాలని, ఆ పరిశోధనలు సమాజానికి ఉపయోగపడేటట్లు ఈ విశ్వవిద్యాలయం కృషిచేయాలని ఆయన అభిలషించారు.

ఈ వేదవిశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయికి ఎదిగి సమాజంలోని ప్రజలందరికి వేదఫలాలను అందించేందుకు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. యూనివర్శిటి ఎదుగుదలకు ఇదోధికంగా కృషిచేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానములకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన యూనివర్శిటిలో శ్రీ వేంకటేశ్వర వైభవం, బృహతి, సంకర్షణ కాండ, నాయద్యుమణి, సామవేద బ్రాహ్మణం, మోక్షసాయ ప్రదీపిక, కళామృతం, ప్రతిష్ట విదర్పణ, స్మార్త పద్ధతి వివేచనిక, ఆంధ్రప్రదేశ్‌ సంసృత శాసనాలు ఒక పరిశీలన అను పుస్తకాలను, అదేవిధంగా వేద ప్రవృత్తి అను యూనివర్శిటి న్యూస్‌ లెటర్‌ని గవర్నర్‌ ఆవిష్కరించారు.

అంతకు మునుపు చతుర్థ వార్షిక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయం ఆవరణలో సుదర్శన హోమం, మహాగణపతి హోమం, నవగ్రహ హోమం, వాస్తు హోమం, రుద్రాభిషేక హోమాలను లోకక్షేమం, విశ్వవిద్యాలయ అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్‌  |జుఐ అధికారి ఎమ్‌.జి.గోపాల్‌, పూర్వపు కార్యనిర్వహణాధికారి శ్రీ ఎ.పి.వి.యన్‌.శర్మ, విశ్వవిద్యాలయ రిజిష్టార్‌ మరియు తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌, విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ సన్నిధానం సుదర్శన్‌ శర్మ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.