522nd VARDHANTI OF ANNAMACHARYA ON MARCH 26 IN TIRUMALA _ మార్చి 26న తిరుమలలో తాళ్లపాక అన్నమయ్య 522వ వర్థంతి మహోత్సవం

Tirumala, 25 March 2025: TTD will organize the 522nd Death Anniversary of Sri Thallapaka Annamacharya on March 26 in Tirumala.

On this occasion, Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi reach Narayangiri Gardens in a procession at 5.30 pm.  

Later, the artists of the Annamacharya project will render  Saptagiri Sankeertana Gosthiganam.  

Later, the Utsava deities return to the temple.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 26న తిరుమలలో తాళ్లపాక అన్నమయ్య 522వ వర్థంతి మహోత్సవం

తిరుమల, 2025 మార్చి 25: పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యల 522వ వర్థంతి మహోత్సవాన్ని మార్చి 26న తిరుమలలో టీటీడీ నిర్వహించనుంది.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 5.30 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించనున్నారు. అటు తరువాత స్వామివారు ఉభయదేవేరులతో కలిసి ఆలయానికి వేంచేపు చేస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.