SRI RAMA CHANDRA MURTY BLESSES DEVOTEES IN VENUGANALANKARA_ వేణుగానాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం

Vontimitta, 26 March 2018: On the second day of ongoing annual brahmotsavams of Lord Sri Kodanda Rama Swamy at Vontimitta on Monday, Lord in “Venuganalankara” blessed devotees.

The four mada streets surrounding the temple assumed a festive look with dance troupes performing Kolatams, chekka bhajans etc. during the procession.

Later Snapana tirumanjanam was performed between 11am and 12noon followed by Unjal Seva in the evening.

DyEOs Smt Goutami, Sri Vijayasaradhi, HDPP Chief Sri Ramakrishna Reddy, Project Officer Sri Ramana Prasad were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వేణుగానాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం

మార్చి 26, ఒంటిమిట్ట, 2018: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేశారు.

సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

హంస వాహనం :

శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. ‘సోహం’ భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ విజయసారధి, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, ప్రాజెక్టు అధికారి శ్రీ రమణప్రసాద్‌ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.