5th Phase of KALYANAMASTHU held at Lalitha Kala Thoranam,Tirupathi _ రాష్ట్రంలోని 19 జిల్లాలో అత్యంత వేడుకగా కల్యాణమస్తు
The 5thphase of Kalyanamasthu programme is performed amidst the ecstasy of the Brides and Bridegrooms and their relatives at the venue Lalitha Kala Thoranam, Municipal Office, Tirupati on October 28. the mass marriages are performed auspicious muhurtam of dhanista nakshatram and Vriscika lagnam between 09.20am to 9.32AM hours on October 28.
The TTD has arranged wedding meals to all the couples and their relatives. Dist Collector Sri V.Seshadhri, TTD, Local M.P Dr. Chinta Mohan, Sri Venkataraman, Dr.N.Yuvaraj, JEO TTD, TTD Spl Officer Sri A.V.Dharma Reddy, Sri PVS.Ramakrishna, C.V&S.O, Sri VSB Koteswara Rao, Chief Engineer TTDs, TTD Officials and large number of relatives have attended and blessed the couples on this occasion.
రాష్ట్రంలోని 19 జిల్లాలో అత్యంత వేడుకగా కల్యాణమస్తు
తిరుపతి, అక్టోబర్-28, 2009: శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కల్యాణమస్తు కార్యక్రమం రాష్ట్రంలోని 19 జిల్లాలో 216 నియోజకవర్గాలలో వధూవరుల తల్లిదండ్రులు, బంధుమిత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు ఆశీర్వాదంతో అత్యంత వేడుకగా జరిగింది.
బుధవారం ఉదయం 9.20 నుండి 9.32 నిమిషాల మధ్య ధనిష్ఠా నక్షత్రం, వృశ్చిక లగ్నమందు వేలాది మంది జంటలు స్వామివారి ఆశీస్సులతో ఒక్కటయ్యారు. హైదరాబాదు లలితకళాప్రాంగణంలో జరిగిన కల్యాణమస్తు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎన్.డి. తివారీ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి శ్రీ గాదె. వెంకటరెడ్డి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యఅతిధులుగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. తితిదే ఛైర్మన్ శ్రీ డి.కె.ఆదికేశవులునాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్.కృష్ణారావులు కల్యాణమస్తు కార్యక్రమ ఏర్పాట్లను ఆధ్యంతం పర్యవేక్షించారు.
అదేవిధంగా తిరుపతిలోని నెహ్రూ లలితకళా ప్రాంగణంలో 47 జంటలు ఈ కల్యాణమస్తులో వివాహం చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎం.పి. చింతామోహన్, జిల్లాకలెక్టర్ శేషాద్రి, తితిదే జె.ఇ.ఒ. యువరాజు, ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి, ఛీఫ్‌విజిలెన్స్ అధికారి రామకృష్ణ, నగర్ పాలక సంస్థ కమీషనర్ మోహన్‌రెడ్డి, రూరల్ తహసీల్దార్ కనకనర్సారెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ ఐదవ విడుత కల్యాణమస్తు కార్యక్రమంలో చిత్తూరు జిల్లాలో 274 జంటలు ఒక్కటవ్వగా రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాలో సుమారు 8 వేల జంటలు వివాహం చేసుకొన్నారని సమాచారం అందియున్నది.
నూతన వధూవరులకు కొత్త దస్తులు, బంగారు తాళిబొట్లు, వెండిమెట్లు, హిందూ వివాహ విశిష్టతను తెలియజేసే పుస్తకాలను తితిదే ఉచితంగా అందజేసింది. అదే సమయంలో వివాహ ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేసారు. అదేవిధంగా ఒక్కో జంట తరపున 60 మందికి భోజనాలు ఏర్పాటు చేసారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.