ECO FRIENDLY ORGANIC CLEANING FOR TTD INSTITUTIONS _ వైకుంఠ ఏకాద‌శినాడు విశేష సేవ‌లందించిన అధికారుల‌కు, సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirupati, 20 Jan. 20: TTD Executive Officer Sri Anil Kumar Singhal directed officials to adopt the usage of Eco-friendly organic sanitary reagents for cleaning the rest houses and institutions in Tirupati.

Addressing senior officers review meeting at the TTD administrative building on Monday the EO complimented the senior officers and staff for serving lakhs of devotees during Vaikuntha Ekadasi and Dwadasi days in Tirumala in a successful manner.

He was all praise for the Additional  Executive Officer Sri AV Dharma Reddy for the excellent coordination of all TTD departments in providing quick Darshan to common devotees on the auspicious days of Vaikunta Ekadasi and Dwadasi.

The EO directed the Pilgrim Welfare Facilitation Services by Srivari Sevakulu to be continued in the Vaikuntam queue complex to co-ordinate their activities and provide quality service to devotees.

He asked the engineering works to be implored under each Superintending Engineer on a war footing basis and that there should be more cashless activity at the Reception and Gold dollar counters.

He said the fire Tendring services at the laddu boondi complex should be further strengthened with modern and effective equipments.

He also wanted the Museum development and garden maintenance works undertaken with partnership of donors should be speeded up further.

EO also suggested for finalisation of launch date for commencement the of works of walkers path top slabs with Reliance Co support and for installation of CCTVs in TTDs local temples.

The TTD EO also directed officials to compile data of vacant posts up to junior assistants in all TTD departments. 

He also wanted an annual calendar of events for the TTD organisations like HDPP Annamacharya Project, Dasa Sahitya Project and Alwar Divya Prabandam Project prepared in advance.

Additional  Executive Officer Sri AV Dharma Reddy, JEO Sri P Basant Kumar, CVSO Sri Gopinath Jatti, FA and CAO Sri O Balaji, Chief Engineer Sri Ramachandra Reddy and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వైకుంఠ ఏకాద‌శినాడు విశేష సేవ‌లందించిన అధికారుల‌కు, సిబ్బందికి కృత‌జ్ఞ‌త‌లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుపతి, 2020 జ‌న‌వ‌రి 20: వైకుంఠ‌ ఏకాద‌శి, ద్వాద‌శి సంద‌ర్భంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం తిరుమ‌ల‌కు విచ్చేసిన ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు టిటిడి అధికారులు, సిబ్బంది స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేసి విశేష‌మైన సేవ‌లు అందించార‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అన్ని విభాగాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని ఈ ప‌ర్వ‌దినాల‌ను విజ‌య‌వంతం చేశార‌ని ప్ర‌శంసించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో సోమ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భ‌క్తుల సౌల‌భ్యం కోసం ఏర్పాటుచేసిన పిడ‌బ్ల్యుఎఫ్ఎస్‌(పిలిగ్రిమ్ వెల్ఫేర్ ఫెసిలిటేష‌న్ స‌ర్వీస్‌) శ్రీ‌వారి సేవ‌కుల ద్వారా భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందించాల‌ని కోరారు. తిరుమ‌లలో ప‌రిశుభ్ర‌త చ‌ర్య‌ల కోసం పూర్తిస్థాయిలో హెర్బ‌ల్ ఉత్ప‌త్తుల‌ను వినియోగిస్తున్నార‌ని, తిరుప‌తిలోని టిటిడి సంస్థ‌ల్లోనూ పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ కోసం వీటిని వినియోగించాల‌ని సూచించారు. ఎస్ఇల ప‌రిధిలో జ‌రుగుతున్న ఇంజినీరింగ్ ప‌నుల‌ను షెడ్యూల్ ప్ర‌కారం పూర్తి చేయాల‌ని ఆదేశించారు. తిరుమ‌ల‌లోని రిసెప్ష‌న్‌, బంగారు డాల‌ర్ల విక్ర‌య కౌంట‌ర్ల‌లో వంద శాతం న‌గ‌దు ర‌హిత లావాదేవీలను ప్రోత్స‌హించాల‌న్నారు. ఉద్యాన‌వ‌నాల నిర్వ‌హ‌ణ‌కు ముందుకొచ్చిన దాత‌ల స‌హ‌కారంతో త్వ‌రిత‌గ‌తిన ప‌నులు చేప‌ట్టాల‌ని కోరారు. బూందీ కాంప్లెక్స్‌లో అగ్నిమాప‌క ప‌రిక‌రాల వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టంగా ఏర్పాటు చేయాల‌న్నారు. దాతల స‌హ‌కారంతో జ‌రుగుతున్న మ్యూజియం అభివృద్ధి ప‌నుల‌ను రానున్న బ్ర‌హ్మోత్స‌వాల్లోపు పూర్తి చేయాల‌ని కోరారు.

అలిపిరి కాలిన‌డ‌క మార్గంలో రిల‌య‌న్స్ సంస్థ స‌హ‌కారంతో నిర్మించ‌నున్న‌ పైక‌ప్పు నిర్మాణ ప‌నుల ప్రారంభ తేదీని ఖ‌రారు చేయాల‌ని ఈవో సూచించారు. టిటిడి అనుబంధ‌ ఆల‌యాల్లో అవ‌స‌ర‌మైన వాటికి త్వ‌రిత‌గ‌తిన సిసిటివిల‌ ఏర్పాటు ప‌నులు పూర్తి చేయాల‌న్నారు. స్థానిక స‌ల‌హా మండ‌ళ్లు గ‌ల ఆల‌యాల్లో నిర్దేశిత వ్య‌వ‌ధిలోపు ఆడిట్‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. టిటిడిలో విభాగాల వారీగా జూనియ‌ర్ అసిస్టెంట్ స్థాయి వ‌ర‌కు, ఆపై స్థాయిలో ఖాళీగా ఉన్న పోస్టుల వివ‌రాల‌ను సేక‌రించాల‌ని సూచించారు. హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్య ప్ర‌బంధ ప్రాజెక్టు త‌దిత‌ర ప్రాజెక్టుల ధార్మిక కార్య‌క్ర‌మాల‌తో వార్షిక క్యాలెండ‌ర్‌ను రూపొందించాల‌న్నారు. .

ఈ స‌మావేశంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రామ‌చంద్రారెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.