PAVITROTSAVAMS CONCLUDES IN KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

Tirupati, 4 Jul. 20: The annual Pavitrotsavams concluded with Purnahuti in Sri Kapileswara Swamy temple on Saturday in Tirupati. 

In view of COVID 19 restrictions the event took place in the temple in Ekantam. 

DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati and others were also present. 

 ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

శ్రీ కపిలేశ్వరాలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుపతి, 2020 జూలై 04: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శ‌ని‌వారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, మహాపూర్ణాహుతి, పవిత్ర సమర్పణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీపనైవేద్యాలు సమర్పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్, శ్రీ శ్రీ‌నివాస నాయ‌క్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.