JYESTABHISHEKAM CONCLUDES IN SRI GT _ క‌వచ సమర్పణతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్ఠాభిషేకం

TIRUPATI, 21 JULY 2021: The annual three-day Jyestabhishekam was concluded on a religious note in Sri Govindaraja Swamy temple at Tirupati on Wednesday.

As a part of the festivities, Satakalasa Homam and Maha Shanti Homam were performed followed by Snapana Tirumanjanam to the processional deities. Later Kavacha Pratista, Akshatarohanam, Brahma Ghosha were rendered followed by Asthanam and Kavacha Samarpana was performed.

Later in the evening, the deities will take procession within the temple complex following Covid guidelines.

HH Tirumala Pedda Jeeyangar, HH Tirumala Chinna Jeeyangar, Special Grade DyEO Sri Rajendrudu and other office staffs were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

క‌వచ సమర్పణతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి జ్యేష్ఠాభిషేకం

తిరుపతి, 2021 జూలై 21: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధ‌వారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు క‌వ‌చాల‌ను ఆల‌య విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వ‌హించారు. ఆ త‌రువాత శతకలశ స్నపనం, మ‌హాశాంతి హోమం చేప‌ట్టారు.

అనంత‌రం మ‌ధ్యాహ్నం 12 నుండి 1 గంట వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌ను కల్యాణమండపంలోకి వేంచేపు చేసి స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో అభిషేకం చేశారు. క‌వ‌చ ప్ర‌తిష్ట‌, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. ఆస్థానం నిర్వ‌హించిన తరువాత స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు.

సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఉభయనాంచారులతో కలసి స్వామివారు ఆల‌య ప్రాంగ‌ణంలో ఊరేగ‌నున్నారు.

శాస్త్రోక్తంగా తులసి మహత్యం ఉత్సవం

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధ‌వారం ఉద‌యం తులసి మహత్యం ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా శ్రీ దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు బంగారు వాకిలి చెంత సింహాస‌నంపై వేంచేపు చేశారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్వామివారికి ఆస్థానం నిర్వ‌హించారు. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఇవో శ్రీ ర‌వికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ వెంక‌టాద్రి, శ్రీ కుమార్‌, కంక‌ణ‌బ‌ట్ట‌ర్ శ్రీ బాలాజి దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునీంద్ర‌బాబు, శ్రీ కామ‌రాజు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.