PAVITROTSAVAMS COMMENCES IN SRINIVASA MANGAPURAM_ నవంబరు 3 నుండి 5వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Srinivasa Mangapuram, Oct 30: The three-day annual ‘Pavitrotsavam’ at Sri Kalyana Venkateswara Swamy Temple in Srinivasa Mangapuram got off to a spiritual start on Wednesday.

Temple priests conducted ‘homam’ in the specially prepared ‘yagasala’ and performed ‘Snapana Tirumanajanam’, later in the evening to the processional deity of Goddess Padmavathi amidst chanting of verses from the scriptures.

The objective behind performing ‘Pavitrotsavam’ every year in the temples is to seek the pardon of the deity for any act of commission and omission committed inadvertently by the priests, by the temple authorities or by the visiting pilgrims and restore the purity in its original pristine form.

DyEO Smt Sarada, AEO Sri Dhanajeyulu, Temple Staff and others took part in this festival.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

నవంబరు 3 నుండి 5వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2018, అక్టోబరు 30: టిటిడికిి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలో కొలువైన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నవంబరు 3 నుండి 5వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

ఇందులో భాగంగా నవంబరు 2వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన నవంబరు 3వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. రెండో రోజు నవంబరు 4వ తేదీన ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పవిత్ర సమర్పణ చేస్తారు. చివరిరోజు నవంబరు 5వ తేదీ రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల కారణంగా నవంబరు 3 నుండి 5వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.