PAVITROTSAVAMS CONCLUDES _ పూర్ణాహుతితో ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

TIRUPATI, 02 OCTOBER 2021: The three day Annual Pavitrotsavams in Srinivasa Mangapuram concluded on Tuesday.

 

In the evening, Asthanam, Purnahuti and Kumbha Prokshana were performed culminating the religious event.

 

CVSO Sri Gopinath Jatti, Temple DyEO Smt Shanti and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

తిరుపతి, 2021 నవంబరు 02: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జ‌రిగిన ప‌విత్రోత్స‌వాలు మంగ‌ళ‌వారం పూర్ణాహుతితో ముగిశాయి.

ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపి, తోమాల, కొలువు నిర్వహించారు. యాగశాల వైదిక కార్యక్రమాల అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం ఆస్థానం అనంత‌రం రాత్రి పూర్ణాహుతి, కుంభ‌ప్రోక్ష‌ణ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంతో ప‌విత్రోత్స‌వాలు ముగిశాయి.

ఈ కార్య‌క్ర‌మంలో సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి,ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, ఏఈవో ధనుంజయుడు, సూప‌రింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ ర‌మ‌ణ‌య్య‌, ఆల‌య అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.