NEW IT APP FOR TTD EDU INSTITUTIONS-EO _ మెరుగైన విద్యాప్రమాణాల కోసం సరికొత్త ఐటీ అప్లికేషన్ : టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి

TIRUPATI, 08 DECEMBER 2021: TTD EO Dr KS Jawahar Reddy on Wednesday directed to prepare a new IT application for enhancing the quality of education in all TTD Educational Institutions.

A review meeting was held in his Chambers ‘ in TTD Administrative Building on Wednesday. Speaking on the occasion the EO has instructed the IT wing to come out with a Student management application.

He said the quality of education of all the TTD Educational Institutions including SVIMS medical college should match the level of Sri Venkateswara Degree College at New Delhi.

The new app should carry the entire academic performance and other related information of the student from the date of his or her joining till he passes out.

JEO for Education and Health Smt Sada Bhargavi, FACAO Sri Balaji, DEO Sri Govindarajan, IT Chief Sri Sesha Reddy, CIO Sandeep, representatives from Jio, all the principals of TTD Educational Institutions were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మెరుగైన విద్యాప్రమాణాల కోసం సరికొత్త ఐటీ అప్లికేషన్ : టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి

తిరుప‌తి, 2021 డిసెంబర్ 08: టిటిడి కళాశాలల్లో మెరుగైన విద్యాప్రమాణాలు నెలకొల్పేందుకు వీలుగా సరికొత్తగా స్టూడెంట్ మేనేజ్మెంట్ అప్లికేషన్ రూపొందించాలని టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల తమ కార్యాలయంలో బుధవారం ఈఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పలు వైద్యవిద్య కోర్సులందిస్తున్ప స్విమ్స్ తో పాటు ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్జిఎస్ ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్, ఎస్వీ జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలల్లో విద్యాప్రమాణాలను ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల స్థాయికి పెంచాలన్నారు. ఇందుకు తగ్గట్టు ఆన్ని చర్యలు తీసుకోవాలన్నారు. నూతన ఐటి అప్లికేషన్ లో విద్యార్థుల అడ్మిషన్లు, హాస్టల్ నిర్వహణ, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ప్రతిభాపత్రాలు తదితర అంశాలన్నీ ఉండాలని సూచించారు. విద్యార్థులు కళాశాలలో చేరినప్పటి నుండి కోర్సు పూర్తి చేసుకొని తిరిగి వెళ్లే వరకు వారికి అవసరమైన సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందు పరచాలన్నారు. త్వరితగతిన ఈ ఐటీ అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఈఓ అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షలో జెఈఓ శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, డిఈఓ శ్రీ గోవిందరాజన్, ఐటీ విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, సిఐఓ శ్రీ సందీప్, ఢిల్లీలోని ఎస్వీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి షీలా రెడ్డి, స్విమ్స్ ఐటి మేనేజర్ శ్రీమతి భావన, జియో సంస్థ నుంచి శ్రీ అమరనాధ్ నాగారం, శ్రీ గౌరవ్ బృందం పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.