ANNAMACHARYA SANKEERTANS VOLUME 2 RELEASED _ జ‌న ‌బాహుళ్యంలోకి అర్థ తాత్పర్యాలతో అన్నమయ్య సంకీర్త‌న‌లు

TIRUMALA, 12 MAY 2023: TTD EO Sri AV Dharma Reddy as released Annamacharya Sankeertans Volume 2 consisting of over 500 new songs with Artha Tatparya Sahita Vyakhyanam.

The release event took place at Annamaiah Bhavan in Tirumala on Friday. Speaking on the occasion the EO said almost after 100 years TTD has taken up the compilation of new songs from Annamacharya Kritis by constituting a team of renowned scholars. In a year’s time over 1000 new songs were brought out in the form of two volumes “, he added.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, Sri Narasimha Kishore, Annamacharya Project Director Sri Vibhishana Sharma, Scholars Sri Sarvottama Rao, Sri Syamalananda Prasad, Sri Peram Naidu, Smt Malaya Vasini, Sri Ramakrishna, Astana Vidwan Sri Balakrishna Prasad, donor and publisher of the book Sri Grandhi Rajesh and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

జ‌న ‌బాహుళ్యంలోకి అర్థ తాత్పర్యాలతో అన్నమయ్య సంకీర్త‌న‌లు

– అన్నమయ్య సంకీర్తన లహరి గ్రంథం -2 ఆవిష్కరణ

– టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి

తిరుపతి, 2023 మే 12: పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలను అర్థ తాత్పర్యాలతో ప్రజలందరికీ చేరువ చేసేందుకు టీటీడీ కృషి చేస్తోంద‌ని టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 614వ జయంతిని పురస్కరించుకొని తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం “అన్నమయ్య సంకీర్తన లహరి గ్రంథం -2 ” ఈవో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ తాళ్ళపాక అన్నమయ్య శ్రీవారిపై 32 వేలకు పైగా సంకీర్తనలు రచించినట్లు తెలిపారు. అన్నమయ్య సంకీర్తనలలో ప్రతి సంకీర్తనకు అర్థ తాత్పర్యాలు, ఆ సంకీర్తన ఏ సందర్భంలో రాశారు, మూలం ఏమిటి అనే విశేష అంశాలు తెలిస్తే గాయకులు భావ భావయుక్తంగా ఆలపిస్తారన్నారు.

శ్రీవారి అనుగ్రహంతో 1922 నుంచి 2022 వరకు అంటే దాదాపు వంద సంవత్సరాల తర్వాత స్వామివారి అనుగ్రహంతో అన్నమయ్య రచించిన సంకీర్తనలకు అర్థ తాత్పర్యాలతో భక్తుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం కలిగిందన్నారు. 16 మంది నిష్ణాతులైన ప్రముఖ పండితులు అన్నమయ్య సంకీర్తనలకు అర్థ తాత్పర్యాలు, విశేష అర్థాలను సమకూర్చారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్. విభీషణ శర్మ, టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, ప్రముఖ పండితులు శ్రీ శ్రీ సర్వోత్తమరావు శ్రీ శ్యామలానందప్రసాద్, శ్రీ పేరం నాయుడు, ఆచార్య రామకృష్ణ, గ్రంథ రచనకు ఆర్థిక సహకారం అందించిన శ్రీ గ్రంథి రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.