SRI VENUGOPALA SWAMY TAKES DIVINE RIDE ON TEPPAM AT KARVETINAGARAM _ తెప్ప‌పై  శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామి విహారం

Tirupati, August 26, 2026: As part of the Teppotsavams at Karvetinagaram Sri Venugopalaswamy Temple, Sri Venugopalaswamy, along with Sri Rukmini and Satyabhama, gave darshan to devotees on the Teppam on Wednesday, the second day of the festival.

The day began with Snapana Tirumanjanam for the processional deities from 9 am to 10 am, with sacred abhishekam using milk, curd, honey, turmeric and sandalwood. A street procession was held at 5.30 pm.

At 7.30 pm, the deities took seven rounds on the Teppam in Skandha Pushkarini and blessed the devotees.

Temple officials, staff and a large number of devotees participated in the celebrations.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

తెప్ప‌పై  శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామి విహారం

తిరుపతి, 2026 ఆగ‌స్టు 26: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్స‌వాలలో భాగంగా రెండ‌వ రోజైన బుధ‌వారం స్వామివారు తెప్ప‌పై  భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం జ‌రిగింది. ఇందులో పాలు, పెరుగు, తెనే, ప‌సుపు, చంద‌నంల‌తో అభిషేకం చేశారు. అనంత‌రం సాయంత్రం 5.30 గంట‌లకు తిరువీధి ఉత్స‌వం నిర్వ‌హించారు.

రాత్రి 7.30 గంటలకు స్కంధ పుష్క‌రిణిలో శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై ఏడు చుట్లు విహరించి భక్తులకు అభయమిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీ‌నివాసులు రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ వీరాస్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.