RETIRING TTD EMPLOYEES TO BE FELICITATED ON AUGUST 31 _ ఆగస్టు 31న మహతిలో పదవీ విరమణ ఉద్యోగులకు సన్మానం

Tirupati, August 27, 2026: TTD employees retiring in August will be felicitated at a special programme to be held at Mahati Kalakshetram, Tirupati, on August 31.

The programme will honour the employees for their dedicated and valuable services rendered to TTD over the years.

Their commitment, hard work and responsible service have contributed significantly to the development of TTD and will always be remembered.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

ఆగస్టు 31 మహతిలో పదవీ విరమణ ఉద్యోగులకు సన్మానం

తిరుపతి, 2026 ఆగ‌స్టు 27: ఆగస్టు నెలలో పదవీ విరమణ పొందుతున్న టీటీడీ ఉద్యోగులకు ఆగస్టు 31న తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

 టీటీడీలో ఎన్నో సంవత్సరాలపాటు విధులు నిర్వర్తించి సంస్థకు అందించిన సేవలను గుర్తించి, పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు.

టీటీడీ సేవల్లో ఉద్యోగుల కృషి, అంకితభావం, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ ఎంతో విలువైనదని, వారి సేవలు సంస్థ అభివృద్ధిలో చిరస్మరణీయంగా నిలుస్తాయని ఈ కార్యక్రమం ద్వారా గౌరవించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.