TRAIL-RUN GARUDA SEVA ON AUGUST 28 _ ఆగస్టు 28న తిరుమ‌ల‌లో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

Tirumala, 27 August 2026: The auspicious Sravana Pournami Garuda Seva will be observed in Tirumala on Friday.

However, this Garuda Seva will be treated as a trial one for the big event which will be observed on September 19 during the ensuing annual brahmotsavams.

The entry and exit points in galleries, security arrangements, other issues with respect to Garuda Seva will be inspected, observed and monitored by the TTD top brass authorities along with the officials and various department HoDs on during the procession of Garuda Vahanam.

Meanwhile Sri Malayappa Swamy will take a ride on Garuda Vahanam in the four Mada streets between 7 pm and 9 pm and blesses devotees.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

ఆగస్టు 28 తిరుమ‌ల‌లో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

తిరుమల, 2026 ఆగస్టు 27: తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున‌ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గ‌రుడ‌వాహ‌నంపై శుక్రవారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు.

సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాదీ ముందుగానే బ్రహ్మోత్సవాల తరహాలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ. 

ఈ సందర్భంగా టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో భ‌క్తుల‌కు కల్పిస్తున్న సౌక‌ర్యాలు, ఇతర ఇంజినీరింగ్‌ ఏర్పాట్లను వివిధ విభాగాధిపతులతో కలిసి పరిశీలించ‌నున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.