VINAYAKA CHAVITHI CELEBRATIONS AT SRI KAPILESWARA SWAMY TEMPLE ON SEPTEMBER 14 _ సెప్టెంబరు 14న శ్రీకపిలేశ్వరాలయంలో వినాయ‌క చవితి వేడుక‌లు

Tirupati, September 12, 2026: Vinayaka Chavithi will be celebrated grandly at the Sri Kapileswara Swamy Temple, Tirupati, on September 14 with special religious programmes.

The celebrations will begin with Suprabhatam, followed by Abhishekam and Archana to the Sri Vinayaka Swamy Moolavirat. At 5.30 pm, a Gramotsavam of Sri Vinayaka Swamy on the Mooshika Vahanam will be conducted.

At Sri Vinayaka Swamy Temple on Second Ghat Road

At the Sri Vinayaka Swamy Temple on the Second Ghat Road, Abhishekam will be performed to the Moolavirat at 8 am, followed by Archana and special pujas.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

సెప్టెంబరు 14 శ్రీకపిలేశ్వరాలయంలో వినాయ‌క చవితి వేడుక‌లు

తిరుప‌తి, 2026 సెప్టెంబరు 12: తిరుప‌తి శ్రీ కపిలేశ్వరాలయంలో  సెప్టెంబరు 14న వినాయక చవితిని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, శ్రీ వినాయ‌క స్వామివారి మూలవర్లకు అభిషేకం, అర్చన చేప‌డ‌తారు. సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ వినాయకస్వామివారికి మూషికవాహనంపై గ్రామోత్స‌వం నిర్వ‌హిస్తారు.

రెండో ఘాట్ రోడ్డులోని ఆల‌యంలో

రెండో ఘాట్‌ రోడ్డులోని శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఉద‌యం 8  గంట‌లకు మూలవర్లకు అభిషేకం నిర్వ‌హిస్తారు. అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జ‌రుగ‌నున్నాయి.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.