A HEART CARRIED BY HOPE _ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయ చికిత్సా కేంద్రంలో 27వ గుండె మార్పిడి విజయవంతం
A 14-YEAR-OLD GIRL GETS A NEW LEASE OF LIFE
27th HEART TRANSPLANT SUCCESSFULLY PERFORMED AT SPCHC
Tirupati, September 21, 2026: While Tirumala was immersed in the grandeur of Brahmotsavam celebrations, a race against time was unfolding on the road from Guntur to Tirupati where a
14-year-old girl at Sri Padmavathi Children’s Heart Centre (SPCHC), TTD, successfully underwent the heart transplantation.
The heart was donated by the family of a 38-year-old man who was declared brain-dead following a road accident.
Four Hours, One Precious Mission:
With no air ambulance available, the TTD Transport Department carried the donor heart by road. The vehicle left Guntur at around 3 p.m. on September 20 and reached SPCHC by 7 p.m.
Physician Assistant Vijay and Perfusionist Shyam Babu accompanied the heart throughout the journey, ensuring its safe and timely transfer through constant coordination with the transplant team.
A New Heart, A New beginning:
The multidisciplinary team at SPCHC successfully completed the eight-hour transplant under the coordination of Dr. N. Srinath Reddy, Director, SPCHC.
The surgical team was led by Chief Cardiac Surgeon Dr. Dipesh Trivedi, with Dr. Madhu Yadav and the cardiac anaesthesia team providing specialised care.
The child is now under intensive post-transplant monitoring.
The procedure marks the 27th heart transplant performed at SPCHC.
The transplant became possible because one grieving family chose to give the gift of life.
Their decision, supported by the medical, transport and organ donation teams, has given a young girl the chance to begin a new life all again.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయ చికిత్సా కేంద్రంలో 27వ గుండె మార్పిడి విజయవంతం
14 ఏళ్ల బాలికకు కొత్త జీవితం.. అవయవదానంతో మరో కుటుంబంలో ఆశాకిరణం
గుంటూరు నుంచి తిరుపతికి రోడ్డుమార్గంలో గుండె తరలింపు.. నాలుగు గంటల్లో సకాలంలో మార్పిడి
తిరుపతి, 2026 సెప్టెంబరు 21: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయ చికిత్సా కేంద్రంలో 27వ గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తున్న 14 ఏళ్ల బాలికకు గుంటూరులో లభించిన దాత గుండెను సకాలంలో తిరుపతికి తరలించి విజయవంతంగా మార్పిడి చేశారు.
అవయవదానంతో చిన్నారికి కొత్త జీవితం
గుంటూరులోని కిమ్స్ ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించబడిన 38 ఏళ్ల వ్యక్తి కుటుంబం అవయవదానానికి ముందుకు వచ్చింది. వారి మానవతా నిర్ణయం మరో చిన్నారికి ప్రాణదానం చేసింది.
ప్రతి నిమిషం కీలకం
ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో టీటీడీ రవాణా విభాగం వాహనంలో సెప్టెంబరు 20న మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు నుంచి గుండెను రోడ్డుమార్గంలో తరలించారు. SPCHCకి చెందిన ఫిజీషియన్ అసిస్టెంట్ విజయ్, పెర్ఫ్యూషనిస్ట్ శ్యామ్ బాబు గుండెతో పాటు ప్రయాణించి, వైద్య బృందంతో నిరంతర సమన్వయం చేశారు.
సాయంత్రం 7 గంటలకు గుండె తిరుపతికి చేరుకోగా, వైద్య బృందం వెంటనే మార్పిడి ప్రక్రియను ప్రారంభించింది. సుమారు ఎనిమిది గంటలపాటు జరిగిన సంక్లిష్ట శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది.
వైద్య బృందం సమష్టి కృషి
SPCHC డైరెక్టర్ డా. ఎన్. శ్రీనాథ్ రెడ్డి సమన్వయంతో, చీఫ్ కార్డియాక్ సర్జన్ డా. దీపేష్ త్రివేది నేతృత్వంలో, కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్ డా. మధు యాదవ్ తో పాటు కార్డియాక్ సర్జన్లు, కార్డియాలజిస్టులు, ఇంటెన్సివిస్టులు, పెర్ఫ్యూషనిస్టులు, నర్సింగ్, ట్రాన్స్‌ప్లాంట్ బృందాలు సమన్వయంతో ఈ గుండె మార్పిడిని విజయవంతంగా నిర్వహించాయి.
ప్రస్తుతం బాలిక వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది.
బ్రహ్మోత్సవాల వేళ ఒకవైపు భక్తులకు సేవలందిస్తూనే.. మరోవైపు ఒక చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టేందుకు టీటీడీ వైద్య బృందం విశేషంగా కృషి చేశారు.
దాత కుటుంబం ప్రాణదానం.. రవాణా బృందం సమయపాలన.. వైద్య నిపుణుల సమష్టి కృషి.. ఒక చిన్నారి జీవితానికి కొత్త ఆరంభాన్ని అందించాయి.


