RELIGIOUS AND MUSICAL PROGRAMMES ATTRACT DEVOTEES DURING BRAHMOTSAVAMS _ బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆక‌ట్టుకున్న ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

Tirumala, 21 September 2026: On the seventh day of the annual Srivari Brahmotsavams on Monday, TTD Hindu Dharma Projects organised various religious and musical programmes at Nada Neerajanam and Asthana Mandapam in Tirumala. The programmes attracted a large number of devotees.

At the Nada Neerajanam venue, Mangala Dhwani was presented from 4:30 a.m. to 5:30 a.m. by the team of Sri B. Keshanna and Sri E. Nagaraju. From 5:30 a.m. to 6:30 a.m., Veda Sandesham was presented by the SV Higher Vedic Studies Institution. From 5:00 p.m. to 6:30 p.m., flute music by Dr. Jayaprada Ramamurthy and her team from Secunderabad entertained the devotees.

At Asthana Mandapam, Vishnu Sahasranama Parayanam was conducted from 7:00 a.m. to 8:00 a.m. by Smt. R. Anitha and her team from Tirupati. From 10:00 a.m. to 11:30 a.m., Bhakti Sangeetam was presented by Smt. Dr. Ramaprabha Yerrampalli and her team from Hyderabad. From 11:30 a.m. to 12:30 p.m., Acharya B. Viswanath from Varanasi delivered a Bhakti sandesham.

From 4:00 p.m. to 5:30 p.m, Annamayya Sankeertanas were presented by Sri C. Bala Subrahmanyam and his team from Tirupati.

From 5:30 p.m. to 7:00 p.m, Harikatha was presented by Smt. Jayanthi Savitri and her team from Tirupati.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆక‌ట్టుకున్న ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

    

తిరుమ‌ల‌, 2026 సెప్టంబ‌ర్ 21; శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం తిరుమ‌ల‌లోని నాద‌నీరాజ‌నం, ఆస్థాన మండ‌పంల‌లో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ధార్మిక, సంగీత కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

ఇందులో భాగంగా నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీ బి.కేశన్న, శ్రీ ఈ.నాగరాజు బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు ఎస్వీ ఉన్నత వేద విద్యాధ్య‌య‌న సంస్థ ఆధ్వర్యంలో వేద సందేశం నిర్వహించారు. సాయంత్రం 5.00 నుండి 6.30 గంటల వరకు సికింద్రాబాద్ కు చెందిన డాక్టర్ జయప్రద రామ్మూర్తి బృందం వేణుగానం భక్తులను అలరించింది‌.

ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుపతికి  చెందిన శ్రీమ‌తి ఆర్.అనిత బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన శ్రీ‌మ‌తి డాక్టర్ రమాప్రభా యర్రంపల్లి బృందం భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి 12:30 గంటల వరకు వారణాసికి చెందిన ఆచార్య బి.విశ్వనాథ్ భ‌క్తి సందేశం అందించారు.

సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ‌ సి.బాల సుబ్రహ్మణ్యం బృందం అన్నమయ్య సంకీర్తనలు భక్తులను అలరించాయి.

సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మతి జయంతి సావిత్రి బృందం హరికథ గానం చేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.