JEO INSPECTS ACHYUTAM, SRIPATHAM DEVELOPMENT WORKS _ అచ్యుతం, శ్రీపథం అభివృద్ధి పనులను పరిశీలించిన టిటిడి జేఈవో
COMPLETE WORKS WITHIN THE STIPULATED TIME: JEO Dr. A. SHARATH
Tirupati, September 24, 2026: TTD JEO Dr. A. Sharath inspected the ongoing development works at the Achyutam and Sripatham buildings in Tirupati on Thursday, along with officials.
He reviewed the accommodation rooms, dormitories, PAC, room booking facilities, lockers and amenities for Srivari Sevaks. He directed the officials to complete the works within the stipulated time while maintaining quality.
TTD CE Sri Manoharam, SE Sri Venkateswarlu, Deputy EO Sri Selvam, VGO Sri Giridhar and other officials were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
అచ్యుతం, శ్రీపథం అభివృద్ధి పనులను పరిశీలించిన టిటిడి జేఈవో
నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలి : జేఈవో డా. ఎ. శరత్
తిరుపతి, 2026 సెప్టెంబరు 24: శ్రీవారి భక్తుల వసతి సౌకర్యాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో తిరుపతిలో నిర్మాణంలో ఉన్న అచ్యుతం, శ్రీపథం భవనాల అభివృద్ధి పనులను టిటిడి జేఈవో డా. ఎ. శరత్ గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వసతి గదులు, డార్మిటరీలు, పీఏసీ, గదుల బుకింగ్, లాకర్లు, శ్రీవారి సేవకుల సౌకర్యాలకు సంబంధించిన పనులను జేఈవో పరిశీలించారు. నిర్దేశిత గడువులోపు నాణ్యతతో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించి, పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సీఈ శ్రీ మనోహరం, ఎస్‌ఈ శ్రీ వేంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవో శ్రీ సెల్వం, వీజీవో శ్రీ గిరిధర తదితర అధికారులు పాల్గొన్నారు.








